Andhra Pradesh

News June 5, 2024

నెల్లూరు: వరప్రసాద్‌కు దురదృష్టం..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో YCPని వీడిన వారంతా TDP, జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్క వరప్రసాద్‌కే ఆ అదృష్టం దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన గూడూరు MLAగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన BJPలో చేరి తిరుపతి పార్లమెంట్ టికెట్ సంపాదించారు. దీని పరిధిలోని 7 చోట్లా కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్ ఓట్ కారణంగా వరప్రసాద్ గట్టెక్కలేకపోయారు.

News June 5, 2024

శ్రీకాకుళం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగులు..!

image

ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరావు తొలిసారి పోటీ చేసి 29,089 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించడంతో .. ఎన్ ఈ ఆర్, వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌పై ఆధిక్యం చాటారు. అయితే ఇతనికి 2009 నుంచి సేవా కార్యక్రమాలలో మంచి పేరు ఉండడంతో ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

News June 5, 2024

జోగి రమేశ్ ఓటమికి కారణాలు ఇవేనా!?

image

కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో పెనమలూరు బరిలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై పోటీ చేసి 59,915 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మారడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, టీడీపీ కంచుకోట నుంచి పోటీ చేయడం జోగి రమేశ్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News June 5, 2024

జమ్మలమడుగులో రికార్డు బ్రేక్

image

జమ్మలమడుగులో ఓ రికార్డు బద్దలయింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు MLAగా గెలిచిన వ్యక్తిగా ఆదినారాయణ రెడ్డి నిలిచారు. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో YCP నుంచి, ఇప్పుడు BJP నుంచి పోటీచేసి కూడా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పొన్నపురెడ్డి శివారెడ్డి గెలిచారు. ఆయన రికార్డును ఆదినారాయణ రెడ్డి బ్రేక్ చేశారు.

News June 5, 2024

తూ.గో: ఒకే కుటుంబం.. నలుగురు ప్రజాప్రతినిధులు

image

రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అదే కుటుంబం నుంచి శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు MLCగా, తల్లి వీరరాఘవమ్మ మేయర్‌గా పనిచేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ భార్య భవాని 2019లో YCP హవాలోనూ TDP నుంచి MLAగా గెలిచారు. ప్రస్తుతం ఆదిరెడ్డి వాసు తూ.గో జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో బంపర్ మెజార్టీ(71,404+)తో గెలిచారు. ఈ కుటుంబంలో నలుగురు ప్రజాప్రతినిధులుగా సేవ చేయడం విశేషం.

News June 5, 2024

భద్రతా చర్యలు చేపట్టిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: ఎస్పీ

image

కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర బలగాలతో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ సమావేశమయ్యారు. అందరూ సమష్టిగా కష్టపడటం వల్లే జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.

News June 5, 2024

ప.గో.: ఆరుగురికి 50వేల ప్లస్ మెజారిటీ.. మీ కామెంట్..?

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గెలుపొందిన కూటమి MLAలలో ఒక్క పోలవరం మినహాయిస్తే.. అన్నీ చోట్ల 25 వేలకు పైగా మెజారిటీలు సాధించారు. మరోవైపు ఆరుగురు MLAలు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరి ఇంత భారీ మెజారిటీలకు కారణం టీడీపీ- జనసేన- బీజేపీ జత కట్టడమే అని లోకల్‌గా టాక్ నడుస్తోంది.
– మీరేమంటారు..?

News June 5, 2024

గిద్దలూరులో నోటాకు అధిక ఓట్లు

image

గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ముత్తుముల కంటే నోటాకే ఇక్కడే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగ్గా ప్రతి రౌండ్లో ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో నోటాకు అత్యధికంగా 174 ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో 21 రౌండ్లలో నోటాకు 2,233 ఓట్లు వచ్చాయి. కాగా ముత్తుములకు 973 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.

News June 5, 2024

కాకినాడ పార్లమెంట్‌లో తంగెళ్ల ఉదయ్ రికార్డ్

image

కాకినాడ MP అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(జనసేన) బంపర్ మెజార్టీతో గెలిచారు. ఉదయ్‌కి 7,29,699 ఓట్లు, చలమలశెట్టి(YCP)కి 5,00,208 ఓట్లు రాగా.. 2,29,491 ఓట్ల మెజార్టీతో ఉదయ్ విజయం సాధించారు. కడియంకు చెందిన ఉదయ్ విదేశాల్లో పలు IT సంస్థల్లో పని చేశారు. 2015లో జాబ్ మానేసి ‘TEA TIME’ బిజినెస్ స్టార్ట్ చేశారు. తాజా ఫలితాల్లో కాకినాడ పార్లమెంట్‌ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో రికార్డ్ తిరగరాశారు.

News June 5, 2024

విశాఖ: కుటుంబంలో ముగ్గురూ ఓటమి

image

వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన బూడికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అనకాపల్లి MPగా పోటీ చేసి.. సీఎం రమేశ్ చేతిలో 2,96,630 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా వైసీపీ తరఫున మాడుగుల MLA బరిలో దిగిన అతని కుమార్తె ఈర్లె అనూరాధకు కూడా ఓటమి తప్పలేదు. TDP అభ్యర్థి బండారు 28,026 ఓట్ల మెజార్టీతో ఆమెపై గెలిచారు. మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అతని కుమారుడికి 395 ఓట్లు మాత్రమే వచ్చాయి.