Andhra Pradesh

News June 5, 2024

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్

image

మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక్కడ గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతోంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బొర్రా వెంకట స్వామితో ప్రారంభమైన ఈ సెంటిమెంట్ తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మరింత ముందుకు తీసుకువెళ్లారు.

News June 5, 2024

ప.గో.: తండ్రి MLA.. కొడుకు MP

image

ప.గో. జిల్లా ఏలూరు MPగా పుట్టా మహేశ్ యాదవ్ తొలిసారి పోటీచేసినప్పటికీ 1,78,326 భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందారు. ఈయన 20.14, 2019లో పోటీచేసినప్పటికీ ఓటమి చవిచూశారు. తాజా గెలుపుతో తండ్రి MLAగా, కొడుకు MPగా సేవలందించనున్నారు.

News June 5, 2024

YCPకి బూస్ట్ ఇచ్చిన చిలకలూరిపేట వాసి.. చివరకు!

image

చిలకలూరిపేటకు చెందిన సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్‌తో ఏపీలోని వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. నిన్నటి ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క చోటా YCP ఖాతా తెరవలేకపోయింది. 17 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. మంగళగిరి, తదితర చోట్ల టీడీపీ గెలుస్తుందనే ఆరా మస్తాన్ అంచనా నిజం కాగా, చాలా చోట్ల ప్రతికూల ఫలితం వచ్చింది.

News June 5, 2024

విశాఖ మన్యంలో వైసీపీకి పట్టం 

image

కూటమి ప్రభంజనంలోనూ అల్లూరి జిల్లా ప్రజలు YCPకే పట్టం కట్టారు. అరకు MPగా గుమ్మ తనూజారాణి, MLAగా రేగం మత్స్యలింగం, పాడేరు MLAగా మత్య్సరాస విశ్వేశ్వరాజును గెలిపించారు. కాగా వీరు ముగ్గురూ తొలిసారిగా పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అల్లూరిలో YCP అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో 2 స్థానాలు అల్లూరి జిల్లాలోనే 2 స్థానాలు ఉండడం గమనార్హం. 

News June 5, 2024

తూ.గో: బావ MLA.. బావమరిది MPగా విజయం

image

ఉమ్మడి తూ.గో ప్రజలు కూటమికి స్పష్టమైన గెలుపునిచ్చారు. 19 నియోజకవర్గాల్లో ఎక్కడా YCP ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో బావ-బావమరిది సత్తాచాటారు. రాజమండ్రి సిటీ TDP అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ YCP అభ్యర్థి మార్గాని భరత్‌పై 71,404+ ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆదిరెడ్డి బావమరిది కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం MPగా గెలిచారు. రామ్మోహన్ నాయుడి సోదరినే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.

News June 5, 2024

కురుపాంలో 30 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

image

తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.

News June 5, 2024

కర్నూలు జిల్లాలో టీడీపీ హవా.. 2 సీట్లకే వైసీపీ పరిమితం

image

కర్నూలు జిల్లాలోని టీడీపీ హవా కొనసాగింది. 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కోడుమూరులో బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలిచారు. వైసీపీ కేవలం మంత్రాలయంలో వై.బాలనాగిరెడ్డి, ఆలూరులో బీ.విరుపాక్షి, బీజేపీ పోటీ చేసిన ఒకేఒక్క స్థానం ఆదోనిలో పార్థసారథి విజయం సాధించారు.

News June 5, 2024

నాడు 25 ఓట్ల తేడాతో ఓటమి.. నేడు 68 వేల మెజారిటీ

image

విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 2019లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఉమ 68,886 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌పై గెలుపొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాక ఉమ సాధించిన 68,886 మెజారిటీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.

News June 5, 2024

ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి పట్టం కట్టిన మాచర్ల

image

మాచర్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జూలకంటి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి, తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1972 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పులి గుర్తుపై పోటీ చేసి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి ఆయనను పల్నాటి పులి అని పిలుస్తారు. 1999 ఎన్నికలలో నాగిరెడ్డి సతీమణి దుర్గాంబ టీడీపీ నుంచి గెలుపొందారు. తాజాగా బ్రహ్మారెడ్డి విజయం సాధించారు.

News June 5, 2024

జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం

image

గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.