Andhra Pradesh

News June 5, 2024

దేశం తరఫున సత్తా చాటిన రైల్వేకోడూరు యువకుడు

image

రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సయ్యద్ అబూబకర్ మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ -2024 పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 2న థాయిలాండ్ లో జరిగిన పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల నుంచి పలువురు యువకులు పాల్గొనగా ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యాన్ని వివరించేలా నిర్వహించిన కార్యక్రమాలలో ప్రతిభ చూపడంతో రన్నరప్ సాధించినట్లు తెలిపారు.

News June 5, 2024

పెందుర్తి సెంటిమెంట్‌కు పంచకర్ల ముగింపు

image

పెందుర్తి సెంటిమెంట్ పంచకర్ల రమేశ్‌బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నియోజకవర్గ నుంచి ఒకసారి గెలిచిన వ్యక్తి రెండో పర్యాయం గెలిచిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా మంగళవారం వెలువడిన ఫలితాల్లో పంచకర్ల 81,870 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్‌పై విజయం సాధించారు. దీనితో పెందుర్తి నియోజకవర్గంలో పాత సెంటిమెంట్‌కి చెక్ పెడుతూ కొత్త చరిత్రను పంచకర్ల రచించారు.

News June 5, 2024

కుప్పంలో 12 మందికి డిపాజిట్ గల్లంతు

image

సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసిన 12 మందికి డిపాజిట్ గల్లంతైంది. చంద్రబాబు 48, 184 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబుకు 1,20,925 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి భరత్ 73, 586 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజులు 2,562 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. నోటాకు 2,111 ఓట్లు వచ్చాయి.

News June 5, 2024

SKLM: సర్పంచ్ నుంచి MLAగా అసెంబ్లీలోకి..!

image

శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గొండు శంకర్ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఓడించారు. శ్రీకాకుళంలోని కిష్టప్ప పేటకు చెందిన శంకర్ 2021లో సర్పంచిగా ఎన్నికయ్యారు. పలు కార్యక్రమాలతో బాబు దృష్టిలో పడిన ఇతను MLA టికెట్ సాధించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కాదని ఇతనికి టికెట్ కేటాయించడంతో వ్యతిరేక గళం వినిపించినా ..ప్రణాళికాబద్ధంగా అన్ని వర్గాలను కలిసి మద్దతు కూడగట్టి విజయం సాధించారు.

News June 5, 2024

ప.గో.: చివరి 6 ఎన్నికలు.. ఆరు పార్టీలకు పట్టం

image

ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అరుదైన రికార్డ్ సాధించింది. 1999 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999- టీడీపీ, 2004- కాంగ్రెస్, 2009- ప్రజారాజ్యం, 2014- బీజేపీ, 2019- వైసీపీ, 2024- జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.

News June 5, 2024

కర్నూలు: తల్లి సర్పంచ్.. కొడుకు ఎమ్మెల్యే

image

గతంలో తల్లి సర్పంచ్ కావడంతో రాజకీయాల్లోకి వచ్చిన బొగ్గుల దస్తగిరి కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరఫున 1985లో ఎం.శిఖామణి, 2014, 2019లో వైసీపీ గెలవగా.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు.

News June 5, 2024

కడప జిల్లా ఎమ్మెల్యేలు వీరే.. మెజార్టీ ఇదే.!

image

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి 17191
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి 22744
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి 25357
బద్వేల్ – దాసరి సుధ 18567
పులివెందుల- వైఎస్ జగన్ 61687
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ 20950
కడప – మాధవి రెడ్డి 18860
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి 2495
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 7016
రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ 11101

News June 5, 2024

తూ.గో.: 25 ఏళ్ల తర్వాత TDP గెలిచింది ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు హవా చూపించారు. అన్నిచోట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి జిల్లాను క్లీన్ స్వీప్ చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాశారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో 1999లో గెలిచిన TDP ఆపై ఎప్పుడూ గెలవలేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత తాజాగా టీడీపీ పాగా వేసింది.

News June 5, 2024

సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా సంధ్యారాణి

image

సాలూరు నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యారాణి రికార్డు సాధించారు. పీడిక రాజన్నదొరపై 13,733 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. సాలూరులో 1952 నుంచి పురుషులే ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే సాలూరు నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన తొలి వ్యక్తి సంధ్యారాణి కావడం గమనార్హం. ఎమ్మెల్సీగా పని చేసిన అనంతరం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News June 5, 2024

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో వీరిద్దరికి మంత్రి పదవులు.?

image

కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై సర్వత్ర ఉత్కంఠ నెలపొంది. జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవులు రేసులో ఉన్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారిలో వీరిద్దరు సీనియర్లు కావటంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి రవీంద్రకు, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.