Andhra Pradesh

News September 12, 2025

కావలి: ఇంట్లోనే సమాధులు.. భయం లేకుండానే కాపురాలు

image

శ్మశాన వాటిక సమీపంలో ఉందంటేనే నివాసం ఉండేందుకు కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కావలిలో మాత్రం సమాధులతోనే కొందరు సావాసం చేస్తున్నారు. గతంలో అక్కడి పెద్దలు శ్మశానానికి 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి అన్యాక్రాంతం అయింది. సమాధులు ఆక్రమించుకుని మరీ ఇల్లును నిర్మించుకోవడంతో, ఇంటి ముందే సమాధులు దర్శనమిస్తున్నాయి. భయం లేకుండానే కాపురాలు చేస్తున్నారు.

News September 12, 2025

ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

image

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 12, 2025

VSUలో కావలి కళాశాలలో బీ ఫార్మసీ కోర్స్

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కావలిలో నడుస్తున్న కళాశాలలో ఈ ఏడాది నుంచి బీ.ఫార్మసీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రిజిస్ట్రార్ సునీత తెలిపారు. ఏపీఈఏపీసీఈటీ 2025 కౌన్సెలింగ్‌లో వీఎస్‌యూ పీఎస్ఎఫ్, కళాశాల కోడ్ పీహెచ్‌ఎం కోర్సు అని వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఏడాదికి రూ. 60 వేలు ఉంటుందని, ఫీజు రీయేంబర్స్ మెంట్ ద్వారా అర్హులైన విద్యార్థులు ఉచితంగా అభ్యసించవచ్చన్నారు.

News September 12, 2025

వెంకటగిరి జాతరకు వెళ్తుండగా వృద్ధురాలి మెడలో సరుడు చోరీ

image

వెంకటగిరి జాతరకి వెళుతున్న క్రమంలో వృద్ధురాలి మెడలో నుంచి సరుడు దొంగలించిన ఘటన నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వెంకటగిరి వెళ్లేందుకు నెల్లూరుకు చెందిన పద్మ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది. వెంకటగిరి వెళ్లే బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు ఎక్కుతుండగా మెడలో ఉన్న రెండున్నర సవర్ల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బజార్ సీఐ కోటేశ్వర్ రావ్ కేసు నమోదు చేశారు.

News September 12, 2025

కర్నూలు కలెక్టర్‌గా సిరి.. ఉద్యోగ ప్రస్థానం ఇదే..!

image

కర్నూలు కలెక్టర్‌గా సిరి నియమితులయ్యారు. శ్రీకాకుళం(D) టెక్కలికి చెందిన ఈమె విశాఖలో MBBS చదివారు. గ్రూప్-1 పరీక్షలు రాసి 2007లో పాలకొండ RDOగా బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో విజిలెన్స్ విభాగం, తూ.గో జిల్లా SC కార్పొరేషన్ ED, విశాఖ జిల్లా పర్యాటక అధికారి, విశాఖ జేసీ-2, ప్రకాశం జిల్లా జేసీ-2, అనంత జిల్లా జేసీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు.

News September 12, 2025

ఉలవపాడు: బాలికను అత్యాచారం చేసిన సచివాలయ ఉద్యోగి

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

కర్నూలు: మీ ఊరి పేరు మార్చాలా?

image

కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అందుకు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మండలాల ఏర్పాటు, గ్రామాల పేర్ల మార్పులు, సరిహద్దులపై ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించి నివేదిక ఇవ్వనుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కర్నూలు నుంచి విడిపోయి ఆదోని కొత్త జిల్లాగా ఏర్పడితే మీ మండలం జిల్లాలో ఉండాలనుకుంటున్నారు? కామెంట్.

News September 12, 2025

శ్రీకాకుళం: 27 వరకు ప్యాసింజర్ రద్దు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.