Andhra Pradesh

News March 19, 2024

తల్లితండ్రులను పట్టించుకోకుంటే కేసులు: కలెక్టర్

image

తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.

News March 19, 2024

కర్నూలు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు క్యాంపు ఆఫీసర్, ఆర్ఐఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. సోమవారం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరిగిందన్నారు. ప్రతిరోజు మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా క్యాంపులో ఉండాలన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 15, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.

News March 19, 2024

ఈవిఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమి తనిఖీ చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

News March 19, 2024

కృష్ణా: యువతకు ముఖ్య గమనిక

image

సైబర్ భద్రతపై యువతీ యువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన వారు https://skilluniverse.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని APSSDC అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 19, 2024

గుంటూరు: ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలకు ఏర్పాట్లు

image

జీజీహెచ్‌లో ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం ఆసుపత్రిలోని క్షయ నియంత్రణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గుండె జబ్బుల ఓపీ సేవలు వారంలో 3 రోజులు మాత్రమే ఉన్నాయని, గుండె జబ్బుతో బాధపడే రోగులు రోజుకు 200 మంది వస్తుండటం వల్ల ప్రత్యేక ఓపీ సేవలు కేటాయించామన్నారు.

News March 18, 2024

సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన శ్రీకాకుళం ఎస్పీ

image

జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 18, 2024

పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక హైస్కూలులో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను తనిఖీ చేశారు. సత్యసాయి జిల్లాలో మొదటి రోజు తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News March 18, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

* కడప పార్లమెంట్ బరిలో వీర శివారెడ్డి.?
* బద్వేల్‌లో ఆక్రమణలు తొలగించాలని ధర్నా
* ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటా: కమలమ్మ
* కడపలో దారుణం.. వ్యక్తిని పొడిచిన వైనం
* కమలాపురంలో బ్యాంకు ఉద్యోగి మృతి
* ఒంటిమిట్ట ఆలయంలో కోతుల పట్టివేత
* కువైట్లో కడప జిల్లా వాసులకు ఊరట
* కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ?
* రాజంపేటలో పెరిగిపోతున్న చోరీలు

News March 18, 2024

కర్నూలు: టెన్త్ పరీక్షలకు 810 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు 33,144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 32,334 మంది మాత్రమే హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దాదాపుగా 44 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ వెల్లడించారు.

News March 18, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవి సమీపించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం మండల, గ్రామ స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆయన RWS అధికారులకు ఆదేశాలిచ్చారు.