India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని అరెస్టు చేసినట్లు గురువారం టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వారి వద్ద నుంచి 6 పేకాట కార్డు ప్యాకెట్లను, రూ.37,160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, గంజాయి, స్మగ్లింగ్, ఎర్రచందనం, మద్యం విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.
స్వర్ణ ఆంధ్ర విజన్-2047 కార్యక్రమంలో వైద్య ఆరోగ్య విభాగంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 92% పనితీరుతో ఏ+ రేటింగ్ సాధించిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు పూర్తి స్థాయిలో టీకాలు వేయడం, శిశు మరణాలు తగ్గించడంలో జిల్లా అద్భుతమైన కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం జిల్లాలోని వైద్య సిబ్బంది సమిష్టి కృషితో సాధ్యమైందని ఆయన అన్నారు.
నెల్లూరు కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
ఈ నెల 13న కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ-లిటిగేషన్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి టి. చంద్రశేఖర్ ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పి. వెంకటలక్ష్మి తెలిపారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చంద్రశేఖర్ 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, పీడీ ఓబయ, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లాలో సర్వికల్ కేన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 2 వారాల పాటు నిర్వహించబోతున్నామని DMHO జీవనరాణి గురువారం తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ కేంద్రాల్లో స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
జీవీఎంసీ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన V-PULL వ్యవస్థను బలోపేతం చేసి సంస్థాగతం చేయాలని గురువారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సూచించారు. ప్రజలు, నిపుణులు, సంస్థలు కలిసి కో-క్రియేషన్ పద్ధతిలో పట్టణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జీవీఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభం కావున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.