Andhra Pradesh

News June 4, 2024

జనసేనానికి 70,354 ఓట్ల మెజార్టీ

image

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మొత్తం 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 18 రౌండ్లకు గానూ 69,169 ఓట్లు మెజార్టీ లభించగా.. పోస్టల్ బ్యాలెట్లు 1671 వచ్చాయి. దీంతో మొత్తం పవన్ కళ్యాణ్‌కు 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. తొలి రౌండ్ నుంచి పవన్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్లగా.. వంగా గీత ఓటమిని చవిచూశారు.

News June 4, 2024

నెల్లూరు రూరల్‌లో టీడీపీ అధ్యిక్యం

image

నెల్లూరు రూరల్‌లో 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 13087 ఓట్ల ఆధ్యిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రబాకర్ రెడ్డికి 28320 ఓట్లు రాగా.. కోటంరెడ్డికి 41407 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

కృష్ణా: రాష్ట్రంలో 2వ స్థానంలో కేశినేని చిన్ని

image

రాష్ట్రంలో టీడీపీ కూటమి తరఫున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం చిన్ని 2,43,850 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా కూటమి ఎంపీ అభ్యర్థులలో నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,56,235 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు.

News June 4, 2024

గుంతకల్లులో గుమ్మనూరు జయరాం గెలుపు

image

గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తన సమీప వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డిపై 9,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి కౌటింగ్‌ పోటాపోటీగా సాగింది. గుమ్మనూరు జయరాం విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

News June 4, 2024

బాపట్లలో నరేంద్ర వర్మ విజయం

image

బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ విజయం సాధించారు. ఆయన మొత్తం 15 రౌండ్లు ముగిసేసరికి 26,800 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆయనకు 88,827 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి 62,027 ఓట్లు నమోదయ్యాయి. 1999 తరువాత 2024లో బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేశారు. నరేంద్ర మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.

News June 4, 2024

ప.గో.లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..? మీ కామెంట్..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 11 చోట్ల ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ 13 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ పాగా వేసింది. మరి ఈ సారి కూటమి మరో 4 చోట్ల గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. పోలవరంలో కొద్దిగా పోటాపోటీ నడుస్తోంది.
– మీ కామెంట్..?

News June 4, 2024

కృష్ణా: రాష్ట్రంలోనే టాప్‌లో సుజనా చౌదరి

image

ఏపీలో బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడింటిలో ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులలో విజయవాడ పశ్చిమ MLA అభ్యర్థి సుజనా చౌదరి 10 రౌండ్లు ముగిసేసరికి 31,891 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. టాప్‌లో ఉన్నారు. మొత్తం పశ్చిమలో 19 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా 10 రౌండ్లు పూర్తయ్యేసరికి సుజనా భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

News June 4, 2024

పెనుకొండలో సవిత భారీ మెజారిటీతో గెలుపు

image

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత 33, 629 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 4, 2024

సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ

image

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న హరీష్ మాధుర్

image

అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగిన గంటి హరీష్ మాధుర్ 2,24,164 ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నారు.
ఆయనకు మెత్తం 4,98,610 ఓట్లు పోల్ కాగా.. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌కు 2,74,446 పోలయ్యాయి. మొదటి నుంచి గంటి హరీష్ మాధుర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.