Andhra Pradesh

News June 4, 2024

సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ

image

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న హరీష్ మాధుర్

image

అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగిన గంటి హరీష్ మాధుర్ 2,24,164 ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నారు.
ఆయనకు మెత్తం 4,98,610 ఓట్లు పోల్ కాగా.. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌కు 2,74,446 పోలయ్యాయి. మొదటి నుంచి గంటి హరీష్ మాధుర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

News June 4, 2024

మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు

image

మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సర్నాల తిరుపతి రావుపై 42829ఒట్ల మోజారిటితో గెలుపొందారు. కాగా మైలవరంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

News June 4, 2024

భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న తంగెళ్ల ఉదయ్

image

కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరఫున బరిలో దిగిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 1,48,775 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి ఉదయ్‌కి మొత్తం 520,192 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 3,71,417 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

News June 4, 2024

ధర్మవరంలో ‘సత్య’మే జయం

image

ధర్మవరం ఎమ్యెల్యేగా సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డిపై సత్యకుమార్ 5000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలినుంచి కేతిరెడ్డి మెజారిటీ సాధించగా.. చివర్లో బీజేపీ పుంజుకుంది. కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కూటమినేతల సపోర్ట్, జాతీయనేత కావడం సత్యకు కలిసివచ్చింది. బీసీ ఓటర్లు సహా అన్ని సామాజికవర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సత్య సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

News June 4, 2024

గుంటూరు ఈస్ట్‌లో TDP విక్టరీ

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి నూరి ఫాతిమాపై గెలుపొందారు. మొత్తం 19 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 99,163 ఓట్లు, నూరీ ఫాతిమాకు 67,812 ఓట్లు వచ్చాయి. దీంతో నజీర్ 31,351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

జగన్‌పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనం: గంటా, సీఎం రమేశ్

image

కూటమికి ఏకపక్షంగా వచ్చిన ఎన్నికల ఫలితాల గురించి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ మంగళవారం సమీక్షించారు. జగన్‌పై ఉన్న కసి, వ్యతిరేకతలు ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయని అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

శ్రీకాకుళం: రాష్ట్రంలో 3వ స్థానంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు

image

టీడీపీ తరపున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ 2,12,501 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా టీడీపీ ఎంపీ అభ్యర్థులలో విజయవాడ, గుంటూరు స్థానాల అభ్యర్థులు కేశినేని చిన్ని- 2,37,657 ఆధిక్యం, పెమ్మసాని చంద్రశేఖర్ 2,17,808 ఆధిక్యంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

News June 4, 2024

నాదెండ్ల మనోహర్‌కు 47,362 ఓట్ల ఆధిక్యం

image

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ ఓట్ల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 47,362 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. నాదెండ్లకు 1,13,596 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు 66,234 ఓట్లు నమోదయ్యాయి. మిగతా 2 రౌండ్లలో కూడా మనోహర్ ఆధిక్యం ప్రదర్శిస్తే, పవన్ లాగా 50వేల ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉంది.

News June 4, 2024

ప.గో.లో క్లీన్‌స్వీప్ దిశగా కూటమి.. 11 మంది WON

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 11 మంది విజయం సాధించారు. మరో నాలుగు స్థానాలు (దెందులూరు, నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు)లో ఫలితం తేలాల్సి ఉంది. వీటిల్లో పోలవరం ఒక చోటనే వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. మిగతా 3 చోట్లా కూటమే ముందంజలో ఉంది.