Andhra Pradesh

News June 4, 2024

జగన్‌పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనం: గంటా, సీఎం రమేశ్

image

కూటమికి ఏకపక్షంగా వచ్చిన ఎన్నికల ఫలితాల గురించి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ మంగళవారం సమీక్షించారు. జగన్‌పై ఉన్న కసి, వ్యతిరేకతలు ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయని అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

శ్రీకాకుళం: రాష్ట్రంలో 3వ స్థానంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు

image

టీడీపీ తరపున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ 2,12,501 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా టీడీపీ ఎంపీ అభ్యర్థులలో విజయవాడ, గుంటూరు స్థానాల అభ్యర్థులు కేశినేని చిన్ని- 2,37,657 ఆధిక్యం, పెమ్మసాని చంద్రశేఖర్ 2,17,808 ఆధిక్యంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

News June 4, 2024

నాదెండ్ల మనోహర్‌కు 47,362 ఓట్ల ఆధిక్యం

image

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ ఓట్ల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 47,362 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. నాదెండ్లకు 1,13,596 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు 66,234 ఓట్లు నమోదయ్యాయి. మిగతా 2 రౌండ్లలో కూడా మనోహర్ ఆధిక్యం ప్రదర్శిస్తే, పవన్ లాగా 50వేల ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉంది.

News June 4, 2024

ప.గో.లో క్లీన్‌స్వీప్ దిశగా కూటమి.. 11 మంది WON

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 11 మంది విజయం సాధించారు. మరో నాలుగు స్థానాలు (దెందులూరు, నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు)లో ఫలితం తేలాల్సి ఉంది. వీటిల్లో పోలవరం ఒక చోటనే వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. మిగతా 3 చోట్లా కూటమే ముందంజలో ఉంది.

News June 4, 2024

ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ ముందంజ

image

ధర్మవరం నియోజకవర్గ 19వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో 11 వేల ఓట్ల లీడ్లోకి కేతిరెడ్డి వెళ్లగా.. బత్తలపల్లె, ధర్మవరం రూరల్ ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపారు.

News June 4, 2024

ఆధిక్యంలో చంద్రబాబును దాటిన గాలి భాను

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో నగరి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఏకంగా చంద్రబాబు ఆధిక్యాన్నే దాటేశారు. భానుకు 10 రౌండ్లలో 32,420 ఓట్ల ఆధిక్యం లభించింది. చంద్రబాబు కేవలం 23,610 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.

News June 4, 2024

ప.గో.లో 9 మంది కూటమి అభ్యర్థులు WON

image

ప.గో. జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. జిల్లాలోని 15 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తోంది. ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విజయ కేతనం ఎగరేయగా.. తాజాగా ఆచంట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ 84429 ఓట్లు సాధించి 26076 మెజారిటీ సాధించారు.

News June 4, 2024

ప.గో.లో 8 మంది కూటమి అభ్యర్థుల విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎవ్వరూ తగ్గట్లేదు. మొత్తం 15 సీట్లలో ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం స్థానాల్లో పాగా వేశారు. తాజాగా తాడేపల్లి గూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 114955 ఓట్లు సాధించి 61510 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో భారీ ఆధిక్యంలో ఉన్నది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా 51,360 ఓట్లు, విజయవాడ తూర్పులో గద్దె రామమోహన్ 39,016, పెనమలూరులో బోడె ప్రసాద్ 36,544 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు వెలంపల్లి, జోగి రమేశ్ విజయవాడ సెంట్రల్, పెనమలూరులో ఓటమి బాటలో ఉన్నారు.

News June 4, 2024

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థికి 1,05,943 ఓట్ల మెజారిటీ

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 2,44,038 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ కు 1,38,095 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,05,943 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.