Andhra Pradesh

News June 4, 2024

జనసేన బోణీ.. తొలి టికెట్, విజయం బత్తులదే

image

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బోణీ కొట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి టికెట్ రాజానగరం. ఇక్కడ కూటమి తరఫున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలి టికెట్ ఈయనదే, విజయం ఈయనదే కావడం విశేషం

News June 4, 2024

సేఫ్ జోన్‌లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

News June 4, 2024

ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

image

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News June 4, 2024

ప.గో.: మరో కూటమి అభ్యర్థి విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరులో విజయం సాధించగా.. తాజాగా చింతలపూడిలో కూటమి అభ్యర్థి సొంగారోషన్ 26972 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

News June 4, 2024

భీమవరంలో పులపర్తి గెలుపు

image

భీమవరంలో కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 64037 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లో ఇప్పటివరకు కొవ్వూరు, పాలకొల్లులో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.

News June 4, 2024

పయ్యావుల కేశవ్ గెలుపు

image

ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలిచారు. 15 రౌండ్లకుగాను పయ్యావులకు 1,00,550 ఓట్లు, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి 79,746 ఓట్లు వచ్చాయి. మొత్తం 21,704 మెజారిటీ వచ్చింది. ఉమ్మడి అనంతలో 12 చోట్ల టీడీపీ విజయం దిశగా దూసుకెళ్లింది. టీడీపీ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. అనంతపురం పట్టణంలోని పయ్యావుల ఇంటి వద్ద ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి.

News June 4, 2024

గెలుపు దిశగా నంద్యాల వరదరాజుల రెడ్డి

image

ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికి 18 రౌండ్‌ ముగిసేసరిగి 22వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇక కేవలం రెండు రౌండ్లు ఉండటంతో ఆయన గెలుపు లాంచనమే అని తెలుస్తోంది.

News June 4, 2024

ప.గో.: మంత్రులంతా ఓటమి దిశగా

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురు ఓటమి దిశగా వెళ్తుండగా.. కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది.

News June 4, 2024

శ్రీకాకుళం: ముందంజలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 4వ రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 1,38,991 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 79,423 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 59,568 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

News June 4, 2024

కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం వివరాలు

image

తిరువూరు: శ్రీనివాస్ 11902
పామర్రు: వర్ల కుమార్ రాజా 11709
నందిగామ: తంగిరాల సౌమ్య 5855
నూజివీడు: కొలుసు పార్థసారథి 2392
జగ్గయ్యపేట: శ్రీరామ్ తాతయ్య 13236
మైలవరం: వసంత కృష్ణప్రసాద్15606
గన్నవరం: వెంకట్రావు 2002
గుడివాడ: వెనిగండ్ల రాము 15668
పెనమలూరు: బోడె ప్రసాద్ 26785
అవనిగడ్డ: బుద్దప్రసాద్ 12864
కైకలూరు: కామినేని శ్రీనివాస్ 9484
పెడన: కృష్ణప్రసాద్ 11264
మచలీపట్నం : రవీంద్ర 15001