Andhra Pradesh

News June 4, 2024

విజయం దిశగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేసిన ఎం.శ్రీభరత్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు 2,36,967 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 1,12,893 ఓట్లు సాధించారు. దీంతో శ్రీభరత్ 1,24,074 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. ఆయన విజయం దాదాపుగా ఖరారు అయినట్లే.

News June 4, 2024

ప.గో.: 50 వేల మెజారిటీ దిశగా RRR

image

ఉండి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. కాగా కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు 81931 ఓట్లు సాధించి 39390 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు 42541 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్!

image

నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పోటీ చేసిన అన్నీ చోట్ల టీడీపి ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 90 వేల మెజార్టీలో దూసుకుపోతున్నారు. కాగా.. 2019లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది.

News June 4, 2024

ఒంగోలు: ఆధిక్యంలో మాగుంట

image

ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధిక్యంలో కొనసాగున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మాగుంట 13,869 ఓట్లతో లీడింగులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉన్నా ఫలితాలు పూర్తయ్యే వరకు ఎవరు గెలుస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

News June 4, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో 3 విజయాలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపులు తేలిపోతున్నాయి. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ (టీడీపీ) 65,400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించార. అనపర్తి నుంచి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు.

News June 4, 2024

ప.గో.లో 2 చోట్ల కూటమి విజయం

image

కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వర రావు విజయం సాధించారు. కాగా ఇప్పడికే ప.గో. జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపొందారు.
– మిగతా 13 చోట్ల విజయం దిశగా కొనసాగుతోంది.

News June 4, 2024

మచిలీపట్నం: 40 వేల మెజారిటీతో దూసుకెళ్తున్న బాలశౌరి

image

మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో NDA కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం 41,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ రౌండ్లలో బాలశౌరి 1,32,678 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 91,104 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ ఇప్పటి వరకు 6,895 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్న స్థానాలివే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 స్థానాల్లో నూజివీడు మినహా మిగిలిన 15 స్థానాలలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది.
*మచిలీపట్నం
*అవనిగడ్డ
*పామర్రు
*గుడివాడ
*పెనమలూరు
*పెడన
*కైకలూరు
*విజయవాడ పశ్చిమ
*విజయవాడ తూర్పు
*విజయవాడ సెంట్రల్
*మైలవరం
*తిరువూరు
*నందిగామ
*జగ్గయ్యపేట

News June 4, 2024

ముందంజలో మిథున్ రెడ్డి

image

రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 16367 ఓట్లతో ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు 258603 ఓట్లు మిథున్ రెడ్డికి పోలవ్వగా.. కిరణ్ కుమార్ రెడ్డికి 241395 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

ఎచ్చెర్ల: కౌంటింగ్ కేంద్రాలు DIG పరిశీలన

image

ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని మంగళవారం మధ్యాహ్నం విశాఖ రేంజ్ DIG విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి, కౌంటింగ్ జరగుతున్న తీరుపై అధికారులును అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నందు ఆయన పర్యవేక్షించారు.