Andhra Pradesh

News June 4, 2024

సత్యవేడులో నువ్వానేనా?

image

తిరుపతి జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ హవా ఉన్నప్పటికీ.. సత్యవేడులో మాత్రం నువ్వానేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం 8,184 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్‌కు 7,246 ఓట్లు వచ్చాయి. టీడీపీ 938 ఓట్ల మెజార్టీతో ముందుకు కొనసాగుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌కు కేవలం 37 ఓట్లే వచ్చాయి.

News June 4, 2024

రికార్డ్.. 7వసారి MLAగా గోరట్ల

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బోణీ కొట్టారు. తొలి విజయం నమోదు చేశారు. 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 61,564 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఈయన 10వసారి పోటీ చేయగా.. 7వ సారి MLAగా గెలిచారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయినకు 60,102 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్

image

5 రౌండ్లు ముగిసేసరికి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో నారాయణ 7వేలు, రూరల్‌లో కోటంరెడ్డి 5వేలు పైచిలుకు, కావలిలో కావ్యకి 7000 పైచిలుకు, సర్వేపల్లిలో సోమిరెడ్డికి 1500పై మెజార్టీ, ఆత్మకూరులో విక్రం రెడ్డికి 1500 ఓట్ల ముందంజ, ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి 600 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. గూడూరులో సునీల్, వెంకటగిరిలో కురుగోండ్ల, పేటలో విజయశ్రీ లీడ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్!

image

ఉమ్మడి విజయనగరంలో మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి అన్నీ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్న బొత్స రెండో రౌండ్ నుంచి వెనుకంజ వేశారు. అటు పార్వతీపురం జిల్లాలో సాలూరు నుంచి రెండు రౌండ్లు లీడ్‌లో ఉన్న రాజన్న దొర మూడో రౌండ్‌కి వెనుకబడ్డారు. దీంతో జిల్లాలోని 9 సీట్లలో 8 టీడీపీ, 1 జనసేన ఆధిపత్యం కనబరుస్తున్నాయి.

News June 4, 2024

ఉమ్మడి ప.గో.లో కూటమి MP అభ్యర్థుల హవా

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్‌కు 1,64,291 ఓట్లు రాగా.. 42177 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. కాగా వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌కు 1,22,114 ఓట్లు వచ్చాయి. అటు నరసాపురంలో బీజేపీ అభ్యర్థి 1,98,676 ఓట్లు రాగా 72738 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఉమాబాలకు 1,25,938 ఓట్ల వచ్చాయి.

News June 4, 2024

కడప జిల్లాలో కూటమి హవా

image

కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. వైసీపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కూటమి అభ్యర్థులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. పులివెందుల, బద్వేల్, రాయచోటి, రాజంపేటలో అధికార పార్టీనేతలు ఆధిక్యంలో ఉన్నారు. కోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో దూసుకెళ్తున్న టీడీపీ కూటమి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం నూజివీడులో మాత్రమే ప్రస్తుతానికి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఉమ్మడి కృష్ణాలో టీడీపీ, జనసేన, BJP శ్రేణులు భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కార్యాలయాల వద్దకు భారీగా ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.

News June 4, 2024

దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 32,834 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి హరీష్ మాధుర్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఎక్కడ వైఎస్ఆర్సిపి తరఫున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు.

News June 4, 2024

ఉత్కంఠ భరితంగా జమ్మలమడుగు

image

జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 7వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢  ఆదినారాయణ రెడ్డి: 34346
➢ సుధీర్ రెడ్డి: 28935
➠ 7వ రౌండ్ ముగిసే సరికి ఆదినారాయణ రెడ్డి 5411 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

చీపురుపల్లి 3వ రౌండ్: బొత్స వెనుకంజ

image

మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.