Andhra Pradesh

News June 4, 2024

కడప జిల్లాలో కూటమి హవా

image

కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. వైసీపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కూటమి అభ్యర్థులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. పులివెందుల, బద్వేల్, రాయచోటి, రాజంపేటలో అధికార పార్టీనేతలు ఆధిక్యంలో ఉన్నారు. కోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో దూసుకెళ్తున్న టీడీపీ కూటమి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం నూజివీడులో మాత్రమే ప్రస్తుతానికి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఉమ్మడి కృష్ణాలో టీడీపీ, జనసేన, BJP శ్రేణులు భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కార్యాలయాల వద్దకు భారీగా ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.

News June 4, 2024

దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 32,834 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి హరీష్ మాధుర్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఎక్కడ వైఎస్ఆర్సిపి తరఫున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు.

News June 4, 2024

ఉత్కంఠ భరితంగా జమ్మలమడుగు

image

జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 7వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢  ఆదినారాయణ రెడ్డి: 34346
➢ సుధీర్ రెడ్డి: 28935
➠ 7వ రౌండ్ ముగిసే సరికి ఆదినారాయణ రెడ్డి 5411 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

చీపురుపల్లి 3వ రౌండ్: బొత్స వెనుకంజ

image

మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

8వ రౌండ్‌లోనూ మాధవి రెడ్డి లీడింగ్

image

కడప అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యత కొనసాగుతున్నది. 8వ రౌండు ముగిసేసరికి 6013 ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా 27841 ఓట్లు రాగా మాధవిరెడ్డికి 33854 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్‌కు 9094 ఓట్లు వచ్చాయి. లీడింగ్ చూస్తుంటే రౌండ్ రౌండ్కి ప్రజల్లో ఉత్కంఠత నెలకొంటుంది.

News June 4, 2024

ప్రొద్దుటూరు: భారీ మెజార్టీతో దూసుకెళ్తున్న టీడీపీ

image

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ 8వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి 43,129 ఓట్లు. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 33,024 ఓట్లు వచ్చాయి. నంద్యాల వరద రాజుల రెడ్డి 10,105 లీడ్‌లో కొనసాగుతున్నారు.
7వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 36,477, వైసీపీ అభ్యర్థికి 30,285 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

ఆచంట 4వ రౌండ్ కంప్లీంట్.. TDP లీడ్ ఎంతంటే

image

ఆచంట నియోజకవర్గంలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి MLA అభ్యర్థి పితాని సత్యనారాయణ 24895 ఓట్లు సాధించగా.. 6581 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు 18314 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కూటమి నాయకులు మంగళవారం జరుగుతున్న ఓట్లు లెక్కింపులో ప్రతి రౌండ్‌లో కూడా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమదాలవలస.. కూన రవికుమార్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం బి అశోక్, పలాస, శిరీష, పాతపట్నం.ఎం గోవిందరావు, శ్రీకాకుళం.. గొండు శంకర్, నరసన్నపేట.. బి రమణమూర్తి, రాజాం..కే మురళీమోహన్ ఆధిపత్యంలో ఉన్నారు.

News June 4, 2024

ఎచ్చెర్ల: ఓట్లు కౌంటింగ్ సరళి ఎస్పీ పరిశీలన

image

ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ప్రతి పాయింట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.