Andhra Pradesh

News June 4, 2024

పులివెందుల 4వ రౌండ్ UPDATE

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠4 రౌండ్లో పోలైన ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 21580
➢ బీటెక్ రవి: 8959
వైఎస్ జగన్ 12000+ ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

గోపాలపురంలో 3rd రౌండ్ కంప్లీట్.. 4121 లీడ్

image

గోపాలపురం నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజుకు మొత్తం 19588 ఓట్లు రాగా.. 4121 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తానేటి వనితకు 15467 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

పులివెందుల 3వ రౌండ్ UPDATE

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 15323
➢ బీటెక్ రవి: 7157
వైఎస్ జగన్ 8166 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

కర్నూలు: 12 స్థానాల్లో టీడీపీ ముందంజ

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో TDP ముందంజలో కొనసాగుతోంది. 2 స్థానాల్లో (పత్తికొండ, ఆలూరు) మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇందులో డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి 12,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. శ్రీశైలం బుడ్డా, ఆళ్లగడ్డ అఖిలప్రియ, నంద్యాల ఫరూక్, కర్నూలు భరత్, నందికొట్కూరు జయసూర్య, ఎమ్మిగనూరు బీసీ జయనాగేశ్వర్ రావు, తదితర TDP అభ్యర్థులు ముందున్నారు.

News June 4, 2024

23 వేల అధిక్యంలో వేమిరెడ్డి

image

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 22942 ఓట్ల ముందంజలో ఉన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయికి 66161 ఓట్లు రాగా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 89103 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

పిఠాపురంలో 20వేల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్

image

నాలుగు రౌండ్లు ముగిసేసరికి పవన్ కళ్యాణ్‌ సుమారు 20వేల ఆధిక్యంలో ఉన్నారు.  మొత్తం 18 రౌండ్లకు గాను 4 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 14 రౌండ్లు మిగిలి ఉన్నాయి. రౌండ్ల వారీగా పవన్‌కు ఓట్లు ఇలా… 1వ రౌండ్-4196,  2వ రౌండ్-3811, 3వ రౌండ్-5497, 4వ రౌండ్- 5640 ఓట్లు వచ్చాయి. 14రౌండ్ల లోనూ ఇదే రీతిలో కొనసాగితే 60 వేలకు పైనే మెజార్టీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడ పార్లమెంట్ తొలి రౌండ్‌‌లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 13 వేల ఓట్ల ఆధిక్యంలో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

కాకినాడ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్

image

పోస్టల్ బ్యాలెట్లలో కాకినాడలోని 7 నియోజకవర్గాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కాకినాడ MP అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 9,530 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఈయనకు 30,779 ఓట్లు రాగా.. YCP అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 21,249తో వెనుకంజలో ఉన్నారు. కాకినాడ-వనమాడి, కాకినాడ రూరల్-పంతం నానాజీ, పిఠాపురం-పవన్, ప్రత్తిపాడు-సత్యప్రభ, పెద్దాపురం- చినరాజప్ప, తుని- దివ్య, జగ్గంపేట- నెహ్రూ ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

లీడ్‌లోకి వచ్చిన పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఎట్టకేలకు మంత్రి పెద్దిరెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు. మొదటి రౌండ్‌లో 136, రెండో రౌండ్‌లో 501 ఓట్లతో వెనుకంజలో కొనసాగారు. తాజాగా మూడో రౌండ్‌లో ఆయనకు 45 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి 16,816 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

కడప పార్లమెంటు 4వ రౌండ్ UPDATE

image

కడపలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 4వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ వైఎస్ అవినాష్ రెడ్డి: 20,085
➢ భూపేశ్ రెడ్డి: 6903
➢ వైఎస్ షర్మిల: 5410 ➠ 4వ రౌండ్ ముగిసే సరికి వైఎస్ అవినాష్ రెడ్డి 13వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.