Andhra Pradesh

News June 4, 2024

భారీ ఆధిక్యంలో దగ్గుబాటి పురందీశ్వరి

image

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కూటమి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 30,743 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు పురందీశ్వరి ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదవ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.

News June 4, 2024

రెండో రౌండ్‌లోనూ వెనుకబడ్డ పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా రెండో రౌండ్‌లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థికి 11,359 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్‌లోనూ 501 ఓట్లతో వెనుకంజలోనే ఉన్నారు.

News June 4, 2024

భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న పెమ్మసాని

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 19,207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం పెమ్మసానికి 41,909 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రోశయ్యకు 22,702 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

image

పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజ

image

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 6138 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 3495 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 2643 మెజార్టీ పొందారు.

News June 4, 2024

చిత్తూరులో టీడీపీ.. తిరుపతిలో వైసీపీ లీడ్

image

TDP చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు లీడ్‌లో ఉన్నారు. ఆయనకు 5695 ఓట్లు రాగా 1638 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప బరిలో ఉన్నారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి 2495 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 17,881 ఓట్లు వచ్చాయి. రాజంపేట వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెనుకపడ్డారు. ఇక్కడ నల్లారి కిరణ్ 1336 ఓట్ల లీడ్‌తో ఉన్నారు.

News June 4, 2024

ఉండి: RRR ఆధిక్యం 2630

image

ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు మొత్తం 6349 ఓట్లు రాగా.. 2630 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 3719 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో కలిశెట్టి అప్పలనాయుడుకి 6,687 ఓట్లు పోలవ్వగా.. చంద్రశేఖర్‌కి 3,772 ఓట్లు పడ్డాయి. అప్పలనాయుడు 2,915 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

News June 4, 2024

పోస్టల్ బ్యాలెట్: ఆధిక్యంలో వైఎస్ జగన్

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 4434
➢ బీటెక్ రవి: 2546
వైఎస్ జగన్ 1888 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

1880 ఓట్ల అధిక్యంలో నందమూరి బాలకృష్ణ ముందంజ

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి టి.ఎన్ దీపికపై 1880 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.