Andhra Pradesh

News June 4, 2024

ప.గో.: ఓట్ల లెక్కింపు.. లీడ్‌లో కూటమి అభ్యర్థులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో పోస్టల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామ కృష్ణరాజు, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, తాడేపల్లిలో బొలిశెట్టి, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

శ్రీకాకుళం: పోస్టల్ బ్యాలెట్‌లో రామ్మోహన్ ఆధిక్యం

image

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 5377 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 3516 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 1861 మెజార్టీ పొందారు.

News June 4, 2024

ఒంగోలులో ఆధిక్యంలో టీడీపీ

image

ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకబడి ఉన్నారు.

News June 4, 2024

నెల్లూరులో 1708 ఓట్ల అధిక్యంలో వేమిరెడ్డి

image

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి సెగ్మంట్‌లో 5357 ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 3649ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. వేమిరెడ్డి 1708 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

272 ఓట్ల ముందంజలో పయ్యవుల కేశవ్

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా ఉరవకొండ టీడీపీ పయ్యావుల కేశవ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 272 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

Breaking: పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యం

image

గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 3971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా పెమ్మసానికి 8027 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 4056 ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

ఆధిక్యంలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్

image

పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఆధిక్యం కొనసాగుతోంది. సమీప అభ్యర్థి వంగ గీతపై పవన్ కళ్యాణ్ 4,350 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ మెజార్టీ 60,000 దాటే అవకాశాలు నెలకొని ఉన్నాయని రాజకీయ నిపుణులు వివరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో కొనసాగుతోంది.

News June 4, 2024

పోస్టల్ బ్యాలెట్: పుట్టాకు 1000 ఓట్ల ఆధిక్యం

image

మైదుకూరు నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2642 ఓట్లకు గాను పుట్టా సుధాకర్ యాదవ్ 1600 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రఘురామిరెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లలో వెనుకంజలో పడ్డారు.

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్‌లో కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కేశినేని నాని కంటే ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఆదిరెడ్డి వాసు, అయితాబత్తుల ఆనందరావు ముందంజ

image

రాజమండ్రి సిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై 3వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు ముందంజలో కొనసాగుతున్నారు.