Andhra Pradesh

News June 4, 2024

ముందంజలో బైరెడ్డి శబరి

image

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. 113 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నంద్యాలలోని శాంతిరాం, ఆర్జీఎం కాలేజీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

News June 4, 2024

బరిలో స్పీకర్ల వారసులు.. విజేతలు ఎవరో..?

image

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన స్వర్గీయ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ బాలయోగి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

News June 4, 2024

పిఠాపురంలో ఎక్కవగా చెల్లని ఓట్లు

image

పిఠాపురంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక్కడ వంగా గీత వైసీపీ నుంచి బరిలో ఉండగా.. రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంపైనే ఫోకస్ ఉంది.

News June 4, 2024

రాజమండ్రి: పోస్టల్ బ్యాలెట్ 1వ రౌండ్ UPDATE

image

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి చెల్లుబోయిన గోపాలకృష్ణ కాంగ్రెస్ నుంచి మురళీధర్ తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢  గోరంట్ల బుచ్చయ్య: 5795
➢ చెల్లుబోయిన: 4885
➢ మురళీధర్: 127
➠ 1వ రౌండ్ ముగిసే సరికి గోరంట్ల 910 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

కుప్పంలో భరత్ వెనుకంజ

image

కుప్పం కౌంటింగ్‌కు సంబంధించి తొలిరౌండ్‌లోనే వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకపడ్డారు. పోస్టల్ ఓట్లలో భరత్ కన్నా చంద్రబాబు 1549 ఓట్లు ఎక్కువగా సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తొలిరౌండ్‌లోనే ఆధిక్యం సాధించారు. ఇక్కడ లక్ష మెజార్టీ సాధిస్తామని టీడీపీ చెబుతోంది.

News June 4, 2024

ఎన్టీఆర్: కౌంటింగ్ కేంద్రం వద్ద అల్పాహారం కొరత

image

ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో అల్పాహారం కొరత వచ్చిందని ఏజెంట్ల ఆందోళన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే కౌంటింగ్ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. సిబ్బందికి భద్రతా, భోజన ఏర్పాట్లు అక్రమంగా ఉండాలని వారి కోరారు.

News June 4, 2024

శ్రీకాకుళం: ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

image

ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం, చివరగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. జిల్లాలో కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు, 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్ళు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుళ్లు ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా, అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది.

News June 4, 2024

వేంపల్లె: వైఎస్సార్‌కు నివాళులర్పించిన షర్మిల

image

ఆంధ్రకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం వైఎస్సార్ ఘాటుకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. వైఎస్సార్ ఘాట్ నుంచి నేరుగా కడప కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

News June 4, 2024

నెల్లూరులో పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

News June 4, 2024

ఇంటి నుంచే ఫలితాలపై పెద్దిరెడ్డి ఆరా..!

image

చిత్తూరు జిల్లా ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.