Andhra Pradesh

News June 4, 2024

విశాఖ: వేటకు సన్నద్ధం అవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ఈ నెల 15 తో ముగియనుంది.ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అప్పుఘర్,వాసవానిపాలెం, పెద్ద జాలరి పేటలో మత్స్యకారులు వేటకు సన్నద్ధం అవుతున్నారు. చేపల వేటకు అవసరమైన వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వేట నిషేధం కారణంగా రెండు నెలలపాటు మత్స్యకారులు ఇంటికే పరిమితం అయ్యారు.

News June 4, 2024

విశాఖ: నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

ఎన్నికల కౌంటింగ్ నేపాథ్యంలో ఏయూకి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని భద్రపరిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఏయూ కళాశాలలో మంగళవారం చేపడుతున్నారు. వర్సిటీలో స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూకు సెలవు ప్రకటించారు.

News June 4, 2024

ప్రకాశం: ఓట్ల లెక్కింపులో ఇవే కీలకం

image

ప్రకాశం జిల్లాలో ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. ఉ. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా MP, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపడతారు. నియోజకవర్గాలుగా వీటిని పరిశీలిస్తే వై.పాలెం (1,549), దర్శి(1,837), S.N.పాడు (1905), ఒంగోలు (4,577), కొండపి (1,794), మార్కాపురం (2,764), గిద్దలూరు (3,550), కనిగిరి (2,480) ఓట్లు పోలైనాయి. ఫలితాల్లో ఇవి కీలకం కానున్నాయి.

News June 4, 2024

కడప: లబ్ డబ్.. లబ్ డబ్..

image

అసెంబ్లీ ఎన్నికల చివరి అంకం నేడే. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 149 మందికి అనుక్షణం తాము గెలుస్తామా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ గతంలో 10కి 10 స్థానాల్లో గెలిచింది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్ని గెలిచేనో..?
గెలిస్తే: ఐదేళ్లు MLA.
అవకాశం వస్తే మంత్రి.
ఓడితే: రాజకీయ భవిష్యత్తు ఎటువైపన్నది కొందరికి ప్రశ్నార్థకం.

News June 4, 2024

ఉమ్మడి కర్నూలులో ఈ సర్వే ఫలితాలు నిజం కానున్నాయా?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీలు YCP, TDP మధ్య పోరు బలంగా ఉంటుందని ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. నేడు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏ సర్వే అంచనాలు నిజం కానున్నాయి. ఎగ్జాక్ట్ పోల్స్ ఆయా సర్వేల అంచనాలను తలకిందులు చేస్తాయా అనేది ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. Rtv: YCP-7, TDP-7చాణక్య X: YCP-8, TDP-4, 2 స్థానాలు టఫ్ ఫైట్BIG TV: TDP-8-9, YCP-5-6KK: TDP-11, YCP-3

News June 4, 2024

విశాఖ: 6,7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు

image

బస్ పాస్ దరఖాస్తు మార్పుల కారణంగా ఈ నెల 6, 7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరల తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి యధావిధిగా బస్ పాసు కౌంటర్లు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి బస్ పాసు చేయించుకునే వారు కొత్తగా గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. పాత కార్డులు చెల్లవని ఆయన స్పష్టం చేశారు.

News June 4, 2024

7వ తేదీ నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్లు

image

పాలిసెట్ అర్హత సాధించి కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 7వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పాలిసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ జయచంద్రారెడ్డి తెలిపారు. నేడు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌన్సెలింగ్ తేదీలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈమేరకు 6న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, 7న వెబ్ ఆప్షన్లు 13న సీట్ల కేటాయింపు, 14న సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రారంభమవుతాయని విద్యార్థులు గమనించాలని కోరారు.

News June 4, 2024

కడప: ఎన్నికల కౌంటింగ్ నేడే.. ఏర్పాట్లు పూర్తి..

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు నేడు తెరవీడనుంది. మరి కొద్ది గంటల్లో నేత భవిష్యత్ తేలిపోనుంది. కడప మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.

News June 4, 2024

జిల్లాలో ఎన్నికల ఫలితాలు తేల్చనున్న 16,36,648 మంది ఓటర్లు

image

అనంతపురం జిల్లాలోని 8అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 26,900 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,97,792 మంది పురుషులు,10,20,124 మంది మహిళలు, 246 మంది ఇతరులు ఉండగా అందులో మొత్తం 16,36,648 మంది, 8,17,536 మంది పురుషులు, 8,19,004 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News June 4, 2024

అనంతపురం జిల్లా అంతటా హై అలర్ట్..!

image

జిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 315 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి పరిస్థితులపై సమాచారం గంటకొకసారి జిల్లా కంట్రోల్ రూమ్ కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 280 ప్రాంతాలలో డ్రోన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.