Andhra Pradesh

News June 3, 2024

ఉప్పెన మూవీ డైరెక్టర్‌కు నాగబాబు పరామర్శ

image

ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబును జనసేన రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు ఈరోజు పరామర్శించారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని బుచ్చిబాబు ఇంటికి నాగబాబు వెళ్లారు. ఇటీవల బుచ్చిబాబు తండ్రి వెంకట్రావు (పెద్దకాపు) అనారోగ్యంతో మృతి చెందగా.. నాగబాబు వెళ్లి బుచ్చిబాబును ఓదార్చారు. ఆయన వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు

News June 3, 2024

ఫలితాలపై ఫేక్ వార్తలు సృష్టిస్తే చర్యలు : కలెక్టర్

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫేక్ వార్తలపై పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫేక్ వార్తలను సృష్టించి ప్రజలను, రాజకీయ పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News June 3, 2024

తొలిఫలితం తేలేది కొవ్వూరు, నరసాపురంలోనే..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

News June 3, 2024

బి.కొత్తకోట: విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం

image

విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం చెందిన విషాదకర ఘటన బి.కొత్తకోట గట్టులో జరిగింది. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని గట్టు గ్రామానికి చెందిన రైతు రామస్వామి (60) రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు పాడి ఆవులను తోలుకుని వెళ్లాడు. సాయంత్రం చీకటి పడుతుండడంతో ఆవులను తొలుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని, అయ్యవారితోపు వద్ద కరెంటు వైర్లు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 3, 2024

తొలిఫలితం తేలేది కొవ్వూరు, నరసాపురంలోనే..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

News June 3, 2024

ఉ.4 గంటలకే సిబ్బంది చేరుకోవాలి: విశాఖ సీపీ

image

పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన స్థానాలకు మంగళవారం ఉదయం నాలుగు గంటలకే చేరుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రాంగణంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కమిషనర్ సూచనలు సలహాలు ఇచ్చారు. మద్యం సేవించారని అనుమానం కలిగితే బ్రీత్ ఎనలైజర్స్ ఉపయోగించాలన్నారు. విధులు సక్రమంగా సమయస్ఫూర్తితో నిర్వహించాలన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా విధులు నిర్వహించాలన్నారు.

News June 3, 2024

పెద్దముడియం హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

image

విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెద్దముడియం పోలీస్ సిబ్బందిపై కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. హౌస్ అరెస్టులో ఉన్న వ్యక్తిని ఇంటి బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన పెద్ద ముడియం హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా సీఐ, ఎస్ఐలకు ఛార్జ్‌మెమో జారీ చేశారు. జమ్మలమడుగు డీఎస్పీకి షోకాజ్ నోటీసు ఇచ్చారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.

News June 3, 2024

చిత్తూరు: చిరుత సంచారం..?

image

కార్వేటినగరం: చింతమండి,ఎంఎం విలాసం(P)ల పరిధిలో చిరుత సంచరిస్తున్నట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చింతమండి గ్రామానికి సమీపంలో గల పంట పొలాల్లో చిరుత సంచరించినట్టు పాద గుర్తులు గుర్తించారు. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. రెవిన్యూ అధికారులతో పాటు అటవీ, పోలీసు అధికారులు పులి పాద ముద్రలను పరిశీలించారు. ఒంటరిగా అటవీ సమీప ప్రాంతాల్లోకి వెళ్లోద్దని హెచ్చరించారు.

News June 3, 2024

కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత: మన్యం జిల్లా ఎస్పీ

image

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కౌంటింగ్ కేంద్రం వద్ద విధులకు హాజరవుతున్న పోలీసులకు సమావేశం నిర్వహించి విధివిధానాలు తెలియజేశారు. కౌంటింగ్ హాజరైన వారికి ఐడీ కార్డు లేనిదే లోనికి అనుమతించరాదన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.