Andhra Pradesh

News September 11, 2025

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా రామకృష్ణ ప్రసాద్

image

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కె.వి.రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖలోని సమస్త ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై 31 వరకు ఆయన సీవీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని మరో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో సీవీవోగా ప్రభుత్వం నియమించింది. సంస్థ సీఎండీ పృథ్విరాజ్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

News September 11, 2025

తూర్పులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

image

తూర్పుగోదావరి జిల్లాలో డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు గత రాత్రి 462 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 140 మందిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 42 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News September 11, 2025

ప్రకాశం నూతన కలెక్టర్.. నేపథ్యం ఇదే!

image

ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2013 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అఫీసర్ గతంలో ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్టెప్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో, హౌసింగ్ కార్పొరేషన్ MD, కృష్ణా కలెక్టర్, విశాఖ గ్రేటర్ కమిషనర్‌గా వివిధ పదవులు నిర్వర్తించారు.

News September 11, 2025

ప్రకాశం కలెక్టర్ మీకోసంకు అధిక ప్రాధాన్యత!

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. 2024 జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఒక ఏడాది 3 నెలల పాలన సాగించారు. ఒంగోలు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో అర్జీదారులకు మాలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అర్జీదారులకు భోజన వసతి, ఫ్రీగా అర్జీల రాయింపు వంటి చర్యలు చేపట్టారు.

News September 11, 2025

అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్‌కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News September 11, 2025

కర్నూలు జిల్లా కొత్త కలెక్టర్ ఈమే!

image

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.అట్టాడ సిరి నియమితులయ్యారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ రంజిత్ బాషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

News September 11, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ నేపథ్యమిదే

image

తమీమ్ అన్సారియ IAS 2015 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డైనమిక్ ఇండియన్ IAS అధికారిణి. ఆమె డిసెంబర్ 31, 1998 న తమిళనాడులో జన్మించారు. కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె 2014లో 17 సంవత్సరాల వయసులో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 314 ర్యాంక్ సాధించారు. ఆమె భర్త డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్‌ కూడా ఐఏఎస్‌ అధికారి.

News September 11, 2025

ముగిసిన వెంకటగిరి జాతర.. వెళ్లిరా పోలేరమ్మా..!

image

వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ముగిసింది. పొలి చల్లడం పూర్తి అయ్యాక ఊరేగింపునకు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన పూల రథంపై అమ్మవారిని ఉంచి సాయంత్రం 5 గంటలు దాటాక నగరోత్సవం ప్రారంభించారు. ఆర్చి సెంటర్ నుంచి రాజావారి వీధి, కాశీపేట, శివాలయం మీదుగా మల్లమ్మ గుడి వీధిలోని విరూపణ మండపం వరకు ఊరేగింపు జరిగింది. ‘ వెళ్లి రా పోలేరమ్మా ‘ అంటూ భక్తులు ఘన వీడ్కోలు పలికారు. 2.30 గంటలు ఊరేగింపు జరిగింది.

News September 11, 2025

నెల్లూరు కొత్త కలెక్టర్ ఈయనే.!

image

నెల్లూరు కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.

News September 11, 2025

విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్ రెడ్డి

image

రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టర్‌ డా.బీఆర్.అంబేడ్కర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్‌మెంట్ అండ్ కమిషనర్ (సీఏడీఏ) నుంచి బదిలీపై వస్తున్నారు.