Andhra Pradesh

News June 3, 2024

ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ఫలితాలు: విశాఖ కలెక్టర్

image

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియలో వెంట‌నే రౌండ్ వారీ ఫ‌లితాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డించాలని, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఆర్వోల‌కు క‌లెక్ట‌ర్ మ‌ల్లికార్జున సూచించారు. వెంట‌వెంట‌నే నిర్దేశిత వెబ్ సైట్ల‌లో అప్లోడ్ చేయ‌టంతో పాటు మీడియాకు కూడా ఫ‌లితాల‌ను ఫెసిలిటేష‌న్ సెంట‌ర్ ద్వారా తెలియ‌జేయాల‌ని చెప్పారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు, సూచనలు సలహాలు ఇచ్చారు.

News June 3, 2024

కౌంటింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయండి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఓలు, తహశీల్దార్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా లోపం రాకుండా పని చేయాలని తెలిపారు. సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకరావాలని కోరారు.

News June 3, 2024

మార్టూరు: మద్యం మత్తులో యువకుడిపై దాడి

image

మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మార్టూరులో చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మస్తాన్ అనే యువకుడు కళ్యాణ్ అనే వ్యక్తిపై బీరు సీసాతో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కళ్యాణిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్బన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News June 3, 2024

1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమం: ముకేశ్ కుమార్ మీనా

image

కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి, బైండోవర్ చేశామన్నారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని స్పష్టం చేశారు.

News June 3, 2024

ఎన్నికల కౌంటింగ్ వేళ.. కడపలో పార్కింగ్ ప్లేస్ లు ఇవే

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈనెల 4వ తేదీ నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లకు పార్కింగ్ ప్లేసులను జిల్లా అధికారులు ఖరారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు ఇందిరానగర్ ఎదురుగా, తెలుగుదేశం పార్టీ అలయన్స్ అభ్యర్థులు, ఏజెంట్లకు శిల్పారామం పక్కన ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు, కౌంటింగ్ స్టాఫ్ కు మాంట్ ఫోర్ట్ స్కూల్లో పార్కింగ్ కేటాయించినట్లు తెలిపారు.

News June 3, 2024

కౌంటింగ్‌కి 1047 మంది ఉద్యోగులు: గుంటూరు కలెక్టర్

image

జూన్ 4న కౌంటింగ్‌కు నాగార్జున యూనివర్సిటీలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1047 మంది ఉద్యోగులను కౌంటింగ్‌కి నియమించి శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్స్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.

News June 3, 2024

ఆమదాలవలస: సింహాసనం ఎవరిది..? సైకత శిల్పం

image

మండలంలోని సంగమేశ్వర కొండ సమీపంలో ఉన్న గాజుల కొల్లివలస గ్రామానికి చెందిన గేదెల హరికృష్ణ అనే సైకత శిల్పి ఎవరిది సింహాసనం అనే సైకత శిల్పం పలువురుని ఆకట్టుకుంది. దేశం పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఫలితాల సందర్భంగా మోదీ, రాహుల్ గాంధీ, రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్, చంద్రబాబు రూపాలతో మధ్యలో సింహాసనం కుర్చీ ఆకారంలో రూపొందించిన సైకిత సందర్శకులను ఆకర్షించింది.

News June 3, 2024

3000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు: సీపీ రామకృష్ణ

image

3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రామకృష్ణ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులకి, సిబ్బందికి సీపీ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కౌంటింగ్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

News June 3, 2024

ఏలూరు జిల్లాలో రేపు లోకల్ హాలిడే

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏలూరు కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్ జిల్లాలో రేపు లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు, అల్లర్లకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని.. ఎదుటి పార్టీపై కవ్వింపు చర్యలు, దుష్ప్రచారాలు చేస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 3, 2024

రైల్వేకోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన అన్నమయ్య(32) బైక్‌ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. పుల్లంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.