Andhra Pradesh

News June 3, 2024

సాలూరులో యువతి ఆత్మహత్య

image

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీహెచ్ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గడివలసకి చెందిన చోడిపల్లి ఉష(19) పట్టణంలో ఓ హోటల్‌లో పని చేస్తుంది. ఆదివారం సాయంత్రం సాలూరులో అద్దెకు ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వచ్చిన ఫిర్యాదుతో వెళ్లి పరిశీలించామన్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 3, 2024

RTV సర్వే: ఉమ్మడి కృష్ణాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా.!

image

ఉమ్మడి కృష్ణాలో TDP-8, YCP-6, JSP-1, BJP-1 చోట్ల గెలుస్తాయని RTV సర్వే తెలిపింది. VJA వెస్ట్-ఆసిఫ్, సెంట్రల్-ఉమా, ఈస్ట్-రామ్మోహన్, నందిగామ-జగన్, మైలవరం-కృష్ణప్రసాద్, తిరువూరు-స్వామిదాస్, జగ్గయ్యపేట-తాతయ్య, గుడివాడ-రాము, పెనమలూరు-బోడె ప్రసాద్, పామర్రు-అనిల్, గన్నవరం-వెంకట్రావు, పెడన- రాము, మచిలీపట్నం-రవీంద్ర, అవనిగడ్డ-బుద్దప్రసాద్, నూజివీడు-ప్రతాప్, కైకలూరు- కె.శ్రీనివాస్ గెలబోతున్నారని పేర్కొంది.

News June 3, 2024

బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు: డీజీపీ

image

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంత మంది, మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ.. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం జరుగుతుందన్నారు.

News June 3, 2024

ప.గో: RTV సర్వే.. TDP-7, YCP-4 , JSP-4

image

ఉమ్మడి ప.గో.లోని 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోందో ‘RTV’ సర్వే చేసింది. ఆచంట-పితాని, ఉండి-రఘురామ, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి, నరసాపురం- నాయకర్, దెందులూరు-అబ్బయ్య చౌదరి, తణుకు-ఆరిమిల్లి, ఏలూరు-బడేటి చంటి, చింతలపూడి-కంభం విజయరాజు, పోలవరం-రాజ్యలక్ష్మి, కొవ్వూరు-ముప్పిడి, నిడదవోలు-కందుల, గోపాలపురం-రాజ్యలక్ష్మి, భీమవరం-రామాంజనేయులు, ఉంగుటూరు-వాసుబాబు, పాలకొల్లు-నిమ్మల గెలుస్తారని అంచనా వేసింది.

News June 3, 2024

తూ.గో: RTV సర్వే.. TDP-10, YCP-04, JSP-05

image

పిఠాపురం-పవన్, తుని- దాడిశెట్టి, ప్రత్తిపాడు-సత్యప్రభ, కాకినాడ(సి)-వనమాడి, కాకినాడ(రూ)-నానాజీ, పెద్దాపురం-చినరాజప్ప, జగ్గంపేట-నెహ్రూ, రాజానగరం-బత్తుల, రాజమండ్రి(రూ)- గోరంట్ల, రాజమండ్రి(సి)-వాసు, అనపర్తి-సూర్యనారాయణ, రంప-ధనలక్ష్మి, కొత్తపేట-బండారు, మండపేట-వేగుళ్ల, రామచంద్రపురం-సూర్యప్రకాశ్, అమలాపురం-ఆనందరావు, రాజోలు-దేవవరప్రసాద్, ముమ్మిడివరం-సుబ్బరాజు, పి.గన్నవరం-గిడ్డి గెలుస్తారని అంచనా వేసింది.

News June 3, 2024

కర్నూలు: Rtv సర్వే TDP-7, YCP-7

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-7 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్,డోన్, పత్తికొండ, ఆలూరు, ఆదోనిలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News June 3, 2024

ఉమ్మడి శ్రీకాకుళం Rtv సర్వే TDP-7, YCP-3

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-3 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ సదర్భంగా అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: గుంటూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా టీడీపీ-6, జనసేన – 1 స్థానం విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ తాడికొండ : తెనాలి శ్రావణ్ కుమార్ ➢ మంగళగిరి: నారా లోకేశ్ ➢ ప్రత్తిపాడు : బూర్ల రామాంజనేయులు ➢ తెనాలి: నాదెండ్ల మనోహర్ ➢ పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్ర ➢ గుంటూరు ఈస్ట్ : మొహ్మద్ నసీర్ ➢ గుంటూరు వెస్ట్: గల్లా మాధవి గెలుస్తారని తెలిపింది.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్‌.. చిత్తూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-4, జనసేన-1 సీటు గెలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లి, పీలేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, సత్యవేడు, గంగాధరనెల్లూరు, మదనపల్లె, పుంగనూరులో YCP గెలిచే అవకాశం ఉందని, తిరుపతిలో జనసేన గెలుస్తుందని తెలిపారు.

News June 3, 2024

ఉమ్మడి కడప జిల్లాలో YCP-6, TDP-2

image

ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-2, YCP-6, BJP, జనసేన ఒక స్థానాల్లో గెలుస్తుందని తెలిపారు. బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటిలో YCP పాగా వేస్తుందని, రాజంపేట, మైదుకూరులో TDP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా జమ్మలమడుగు BJP, కోడూరులో జనసేన అభ్యర్థులు గెలుస్తారన్నారు. దీంతో YCP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.