Andhra Pradesh

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: విజయనగరంలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది స్థానాల్లో టీడీపీ-4, వైసీపీ-4, జనసేన ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది.
➢ కురుపాం: పుష్పశ్రీవాణి
➢ పార్వతీపురం: అలజంగి జోగారావు
➢ సాలూరు: పీడిక రాజన్నదొర
➢ బొబ్బిలి: బేబినాయన
➢ గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్
➢ చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ
➢ నెల్లిమర్ల: లోకం మాధవి
➢ ఎస్.కోట: కోళ్ల లలితకుమారి
➢ విజయనగరం: అతిది గజపతిరాజు గెలుస్తారని తెలిపింది.

News June 3, 2024

కర్నూలు: మైక్రో అబ్జర్వర్లకు కలెక్టర్ శిక్షణ

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు-2024 కౌంటింగ్ నిర్వహణపై జనరల్ అబ్జర్వర్స్ జాఫర్, మీర్ తారిఖ్ అలీ, బిపుల్ సైకియా సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్జే మధుసూదన్ రావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు సోమశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, సిద్ధలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

News June 3, 2024

VZM: MLC ఇందుకూరిపై అనర్హత వేటు

image

విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై వైసీపీ అనర్హత వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థులకు సహకరించారని ఆరోపణలతో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని 3సార్లు పిలిచినా.. డుమ్మా కొట్టడంతో.. సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

News June 3, 2024

నిబంధనల మేరకు కౌంటింగ్‌ విధులు

image

నెల్లూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్‌ సిబ్బంది భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే పని చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి కారణాలు లేకుండా ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకూడదని చెప్పారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్ల సందేహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

News June 3, 2024

ప్రకాశం: చెరువులో పడి 13 ఏళ్ల బాలుడు మృతి

image

కురిచేడు మండలం పడమరకాశీపురంలో చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. సోమవారం గ్రామానికి చెందిన సాధం బంగారు(13) తమ గేదెలను తోలుకొని మేతకు వెళ్ళాడు. గేదెలకు నీళ్లు తాగించడానికి చెరువులోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన గేదెలను తోలేందుకు వెళ్ళగా.. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు బాలుడి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీశారు.

News June 3, 2024

అనంత: గోడ కూలి మీద పడటంతో యువకుడి మృతి

image

ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ప్రహరీ కూలి మీద పడటంతో బన్నీ(21) అనే యువకుడు మృతి చెందాడు. అతడితోపాటు ఒక ఎద్దు కూడా మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. బన్నీ ఎద్దులను నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గోడ కూలి మీద పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

News June 3, 2024

రేపు బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని పలు డివిజన్లలో భద్రతా పనులు జరుగుతున్నందున అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే ట్రైన్ నం.18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ట్రైన్‌ను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని ఆయన కోరారు.

News June 3, 2024

కర్నూలు: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

image

గడివేముల నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కాల్వ గ్రామం వద్ద బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కండక్టర్ ప్రయాణికులను ఇంకో బస్సులో తరలించారు.

News June 3, 2024

VZM: ఆలయాల బాట పట్టిన కోలగట్ల

image

నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం పుత్యుల వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మల్యేగా తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 3, 2024

అనంత: రానున్న 5 రోజులలో మోస్తారు వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. సోమవారం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచన ఉందన్నారు. మిగిలిన రోజుల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు.