Andhra Pradesh

News June 3, 2024

వంగరలో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి

image

వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.

News June 3, 2024

చోడవరంలో గెలుపు నాదే: దర్మశ్రీ

image

వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ సోమవారం చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా రావడంతో పాటు.. రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి జగన్ సీఎం అవుతారని చోడవరంలో తాను రెండోసారి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

News June 3, 2024

పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా

image

అనంతపురం: ఏపీపాలిసెట్-2024లో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్ సి.జయచంద్రా రెడ్డి తెలిపారు. 3న జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ మార్పు చేశామన్నారు. అదే విధంగా వెబ్ ఆప్షన్లు ఈ నెల 7నుంచి ఇచ్చుకో వచ్చునని పేర్కొన్నారు.

News June 3, 2024

కృ‌ష్ణా: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం

image

ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8గంటలకు పోస్టల్ ఓట్లు లెక్కింపు ప్రారంభించనుండగా 8.30ని.లకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. అయితే పోస్టల్ ఓట్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ వీటి ఫలితమే ఆలస్యంగా రానుంది. పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

News June 3, 2024

సీసీ కెమెరాలు గుప్పిట్లో అనంత జిల్లా అంతటా 730 కెమెరాలు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాలతో పాటు ఇదివరకే ఏర్పాటు చేసిన మరో 450 కెమెరాలతో భద్రతను పర్యవేక్షించాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. ఈ కెమెరాలను జిల్లా కేంద్రంలోని ఈ సర్వేలెన్స్ సెంటర్‌కు అనుసంధానించినట్లు తెలిపారు. ఏ చిన్న అవాంచనీయ ఘటనకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలకు దిగినా సీసీ పుటేజీల్లో దొరికిపోతారన్నారు. కేసులు నమోదైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 3, 2024

NLR: ఆ ముగ్గురికీ గెలుపు కీలకం

image

నెల్లూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ నాయకులకు రేపటి ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవే చివరి ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చొని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరికొద్ది గంటల్లోనే వారి భవితవ్యం తేలనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

పుంగనూరు: వేదవతికి ఏ కష్టం వచ్చిందో..?

image

నిన్న రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పుంగనూరు(M) భీమగానిపల్లెకు చెందిన వేదవతి మదనపల్లెకు చెందిన దస్తగిరిని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే దస్తగిరికి పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమెకు ఏ కష్టం వచ్చిందో తెలియదు. డ్యూటీలో ఉండగా నిన్న సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత డ్యూటీ గదిలోనే గన్‌తో కాల్చుకుని చనిపోయారు.

News June 3, 2024

అనంతపురం నియోజకవర్గాల కౌంటింగ్ ప్రాంతాలు ఇవే..!

image

రాయదుర్గం కౌంటింగ్ ప్రధాన భవనం ఫస్ట్ ఫ్లోర్, ఉరవకొండ అడ్మినిస్టేటివ్ భవనం గ్రౌండ్ ఫ్లోర్, గుంతకల్లు మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, తాడిపత్రి మెయిన్ బిల్డింగ్ సౌత్వింగ్ గ్రౌండ్ ఫ్లోర్, శింగనమల ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, అనంతపురం కౌంటింగ్ ఈసీఈ గ్రౌండ్ ఫ్లోర్, కళ్యాణదుర్గం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, రాప్తాడు ఈసీఈ నార్త్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిర్వహించనున్నారు.

News June 3, 2024

తూ.గో.: బరిలో 25 మంది మహిళలు

image

ఉమ్మడి తూ.గో.లో MP, MLA స్థానాల నుంచి 25మంది మహిళలు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి. రాజమండ్రి పార్లమెంట్‌కు పురందీశ్వరి (BJP), బాల నవీన (స్వతంత్ర), కాకినాడ పార్లమెంట్‌కు అనూష యాదవ్ (BCYP) పోటీ చేశారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట నుంచి ఒకరు, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు అసెంబ్లీలకు ఇద్దరు చొప్పున పోటీచేశారు. కాకినాడ, తూ.గో. జిల్లాలో 16 మంది పోటీ చేశారు.

News June 3, 2024

కొయ్యూరు: బొంతువలస ఘాట్‌లో గ్యాస్ వాహనం బోల్తా

image

కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల నుంచి గూడెం కొత్తవీధి మండలం పెదవలస వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బొంతువలస ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదవలస వైపు నుంచి కొయ్యూరుకు వస్తున్న ఓ గ్యాస్ వాహనం ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘాట్ దిగుతున్న సమయంలో బ్రేక్ ‌లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాహనంలో సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు.