Andhra Pradesh

News June 3, 2024

విశాఖ: ఎన్నికల కౌంటింగ్ ‌కు 857 మంది సిబ్బంది

image

ఎన్నికల కౌంటింగ్ 257 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 309 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు వినియోగిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్లు 281 మంది ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు మొత్తం 857 మంది సిబ్బందిని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వినియోగిస్తున్నారు. రిజర్వుడ్ స్టాఫ్ తో కలిపి 1045 మంది సిబ్బందిని ఎన్నికల కౌంటింగ్ కోసం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు.

News June 3, 2024

వీరఘట్టం: పిడుగుపాటుకు భారీగా పక్షులు మృత్యవాత

image

వీరఘట్టం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం రాత్రి పడిన భారీ పిడుగులకు పిడుగులకు భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారు 60 రామచిలుకలు, 48 కాకులు, 5 గద్దలు మృతి చెందాయి. మృతి చెందిన పక్షులన్నింటినీ పోలీస్ సిబ్బంది సమీపంలో ఖననం చేశారు. పిడుగుపాటుకు పోలీస్ క్వార్టర్స్‌తో పాటు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

News June 3, 2024

విశాఖ: 645 మంది పోలీసులు, 176 సీసీ కెమెరాలు

image

మంగళవారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అణువు పర్యవేక్షించే విధంగా 176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 84 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 60 మంది ఏపీ ఎస్పీ పోలీసులు, 9 యాక్సెస్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం 501 మంది సివిల్ పోలీస్ ఫోర్స్ సైతం వినియోగిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు.

News June 3, 2024

విశాఖ: 650 మంది రౌడీ షీటర్లు హౌస్ అరెస్ట్

image

ఈనెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నగరంలో 650 మంది రౌడీ షీటర్లను హౌస్ అరెస్ట్ చేసినట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. 91 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. ముఖ్యమైన నాయకులకు అభ్యర్థులకు షాడో టీంలు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేశామన్నారు.

News June 3, 2024

కౌంటింగ్‌కు ఇవి తీసుకెళ్తే కేసులు తప్పవు: అనంతప ఎస్పీ

image

అనంతలో ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు నీటి సీసాలు, ఇంక్ పెన్నులు, ఫోన్‌లు తీసుకెళ్లరాదని ఎస్పీ గౌతమి శాలి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏ చిన్న గొడవ జరిగినా వెబ్‌కాస్టింగ్‌లో రికార్డవుతుందన్నారు. అక్కడ తోసుకోవడం, కౌంటింగ్ ప్రాంతంలో మెష్ పడేయడం వంటివి చేస్తే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. అందరూ శాంతియుత వాతావరణానికి సహకరించాలన్నారు.

News June 3, 2024

మైదుకూరుకు ఛాన్స్: ఆరా

image

కడప జిల్లాలో టీడీపీకి మైదుకూరు స్థానం ఒక్కటి గెలిచే ఛాన్స్ ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. అలాగే అంజాద్ బాషా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల 12% ఓట్లు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లో ఇవి వాస్తవమా.. అవాస్తవమా అనేది తేలనుంది. దీనిపై మీ కామెంట్.

News June 3, 2024

చెవిరెడ్డి గెలుస్తారు: ఆరా

image

ఒంగోలు YCP MP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి YCPకి బలమైన నియోజకవర్గాలు కాబట్టి ఒంగోలు ఎంపీగా గెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే చీరాల, ఒంగోలులో వైసీపీ విజయం సాధిస్తుందని, కొండపిలో ఓడిపోతుందని, కందుకూరు, అద్దంకిలో టైట్ ఫైట్ ఉండబోతోందని తెలిపారు.

News June 3, 2024

నెల్లూరు జిల్లాలో డ్రై డే: కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఎన్.హరినారాయణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కౌంటింగ్ రోజును పూర్తి డ్రైడేగా పాటించాలని, దుకాణదారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 3, 2024

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కు స్వల్ప విరామం

image

జిల్లాలో పాలీసెట్ 2024 అభ్యర్థుల కౌన్సెులింగ్‌కు స్వల్ప విరామం ప్రకటించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జి.దామోదరరావు తెలిపారు. ఆదివారం 92,001 నుంచి 1,08,000 ర్యాంకు మధ్య విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను 6వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. 6వ తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు హాజరు కానున్నారు.

News June 3, 2024

ప.గో.: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ప.గో. జిల్లా కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.