Andhra Pradesh

News March 18, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

* కడప పార్లమెంట్ బరిలో వీర శివారెడ్డి.?
* బద్వేల్‌లో ఆక్రమణలు తొలగించాలని ధర్నా
* ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటా: కమలమ్మ
* కడపలో దారుణం.. వ్యక్తిని పొడిచిన వైనం
* కమలాపురంలో బ్యాంకు ఉద్యోగి మృతి
* ఒంటిమిట్ట ఆలయంలో కోతుల పట్టివేత
* కువైట్లో కడప జిల్లా వాసులకు ఊరట
* కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ?
* రాజంపేటలో పెరిగిపోతున్న చోరీలు

News March 18, 2024

కర్నూలు: టెన్త్ పరీక్షలకు 810 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు 33,144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 32,334 మంది మాత్రమే హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దాదాపుగా 44 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ వెల్లడించారు.

News March 18, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవి సమీపించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం మండల, గ్రామ స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆయన RWS అధికారులకు ఆదేశాలిచ్చారు.

News March 18, 2024

విశాఖలో ‘టైగర్‌ ట్రయాంఫ్‌–2024’ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్‌ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి.. ఎక్స్‌గ్రేషియా అందజేత

image

వేపాడ(M) <<12875448>>కుంపల్లి<<>>కి చెందిన డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుని మృతుడి భార్య హేమలతకు అందజేశారు.

News March 18, 2024

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో బీ ఫార్మసీ (B.Pharmacy) రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 18, 2024

కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

image

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.

News March 18, 2024

అమలాపురం అల్లర్లు.. జీవోపై హైకోర్టు స్టే

image

అమలాపురం అల్లర్లపై కేసులు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దళిత నాయకులు జంగా బాబురావుతో పాటు మరో ఆరుగురు నేతలు వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై గొడవలు జరిగాయి. అప్పట్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 18, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి’

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనతో విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. ఎన్నికల నిర్వాణపై జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నెరవేర్చాలన్నారు.

News March 18, 2024

కర్నూలు: పీజీ సెమిస్టర్‌కు 90శాతం హాజరు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.