Andhra Pradesh

News June 3, 2024

విశాఖలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

image

ఏయూలో రేపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మద్దిలపాలెం ఇంజినీరింగ్ ఆర్చ్ గేటు నుంచి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే రహదారిలో సాధారణ వాహనాలకు అనుమతులు ఉండవని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 215 మంది ట్రాఫిక్ పోలీసులతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

News June 3, 2024

కర్నూలు: ఒక్కరోజే రూ.5కోట్ల మద్యం అమ్మకాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బారులు ఉన్నాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3, 4వ తేదీల్లో విక్రయాలు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.5కోట్లకుపైగా అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా. కలెక్టర్ ఆదేశాలమేరకు ఆదివారం రాత్రి మద్యం దుకాణాలు బంద్ చేశారు.

News June 3, 2024

ప.గో.: ఇక్కడ గొడవలు అయ్యే అవకాశం.. SPలు వార్నింగ్

image

☛ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో దెందులూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరులో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసుల అంచనా.
☛ ఉమ్మడి ప.గో.లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు.
☛ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – SPలు మేరీ ప్రశాంతి, అజిత
☛ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బంది
☛ ఏలూరులో 42 అతిసమస్యాత్మక, 92 సమస్యాత్మక, ప.గో.లో అతిసమస్యాత్మక 22, సమస్యాత్మక 135 ప్రాంతాల గుర్తింపు.
➤ SHARE IT

News June 3, 2024

NLR: ఎన్నికలకు పరిశీలకుల నియామకం

image

ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకులను నియమించారు. కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంట్‌కు నితిన్ సింగ్ బదారియా అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారు. కందుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు పార్లమెంట్‌కు రాం మార్గాతం.. కావలి, ఆత్మకూరు, నెల్లూరు పార్లమెంట్‌కు అభిలాశ్ కుమార్‌ను పరిశీలకునిగా నియమించారు.

News June 3, 2024

నరసరావుపేట: ఓట్ల లెక్కింపు.. ట్రాఫిక్ మళ్లింపు

image

నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కాలేజీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నరసరావుపేట నుంచి వినుకొండకు రైల్వేస్టేషన్ రోడ్డు, లింగంగుంట్ల, ఇక్కర్రు, రొంపిచర్ల క్రాస్ రోడ్, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా వెళ్లాలి. నరసరావుపేట నుంచి ఒంగోలుకు, చిలకలూరిపేట, NH-16మీదుగా చేరుకోవాలి. నరసరావుపేటకు బయట వ్యక్తులు రాకూడదని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు.

News June 3, 2024

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. శ్రీకాకుళంలో పట్టాభిషేకం ఎవరికో?

image

ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌‌తో నేతలతో పాటు బెట్టింగ్ రాయుళ్లలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చిలకపాలెం సమీపంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్ తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News June 3, 2024

కడప: ఇద్దరి మద్య గొడవ.. పక్కనున్న మహిళకు గాయాలు

image

నందలూరు మండల పరిధిలోని చింతలకుంటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని విడిపించడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు రాయి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలింది. హుటాహుటిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ: వర్మ

image

జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత, పిఠాపురం  కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ ఖాయమని మాజీ MLA ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం మండలం కోలంకలో పర్యటించిన ఆయన గాజుగ్లాసులో టీ తాగి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పాయన్నారు. అలాగే, పవన్ గెలుపు కూడా ఖాయమని చెప్పినట్లు గుర్తుచేశారు.

News June 3, 2024

నెల్లూరు జైలులో ఏడుస్తూనే ఉన్నా: సతీశ్

image

సీఎం జగన్‌పై రాయి విసిరిన దానికి తనకు సంబంధం లేదని నిందితుడు సతీశ్ స్పష్టం చేశాడు. ‘అసలు నిందితులు ఎవరో పట్టుకోకుండా నన్ను ఇరికించారు. దాడి నేను చేయలేదని ప్రతి అధికారికి చెప్పినా పట్టించుకోలేదు. 45 రోజులు నెల్లూరు జైలులో నరకయాతన అనుభవించా. అమ్మానాన్న గుర్తు వచ్చి ప్రతిక్షణం ఏడ్చాను. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా’ అని బెయిల్‌పై విడుదలైన తర్వాత సతీశ్ అన్నాడు.

News June 3, 2024

31 మంది టీడీపీ నాయకులకు బెయిల్‌

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగిన గొడవలకు సంబంధించి 37 మంది టీడీపీ నాయకులుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 31 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆరుగురికి బెయిల్‌కు రాలేదు. 14న గొడవ జరిగితే 26న వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం తెలిసిందే.