Andhra Pradesh

News September 11, 2025

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బదిలీ

image

సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కీర్తి చేకూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి చేకూరి స్వస్థలం వైజాగ్, ఆమె ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ చేశారు. గతంలో గుంటూరు నగర కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు.

News September 11, 2025

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.

News September 11, 2025

కర్నూలు జిల్లా కలెక్టర్ బదిలీ

image

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బదిలీ అయ్యారు. జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఎ.సిరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 11, 2025

నెల్లూరు కలెక్టర్ ఆనంద్ బదిలీ

image

నెల్లూరు కలెక్టర్ ఆనంద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2025

తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

image

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితి‌లో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.

News September 11, 2025

VZM: ‘శిశు మరణాలు సంభవించకుండా చర్యలు’

image

విజయనగరం జిల్లా వైద్యారోగ్య శాఖ సమన్వయ సమావేశాన్ని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది. DMHO జీవన రాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆగస్టు నెలలో సంభవించిన 3 శిశు మరణాలపై సమీక్షించారు. భవిష్యత్తులో శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని DMHO సూచించారు. గర్భస్థ దశలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, గర్భిణీలలో రక్తహీనత నివారణకు ఐరన్ టాబ్లెట్లు అందించాలన్నారు.

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News September 11, 2025

మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

image

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.

News September 11, 2025

VZM: సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

image

సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్‌లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

News September 11, 2025

కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

image

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.