Andhra Pradesh

News June 3, 2024

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ డా.సృజన తనిఖీ చేశారు. నాల్గో తేదీ జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

News June 3, 2024

శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు: అనంత ఎస్పీ

image

కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని అనంత ఎస్పీ గౌతమిశాలి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా చూడాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

News June 3, 2024

సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ 

image

596 జీవోను రద్దు చేయడంతో పాటు లావాదేవీలను నిలిపివేయాలని కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని అడ్డంగా కొట్టేసిన వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం వ్యవహారంపై మాజీ ఐఏఎస్‌లు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా జరగని వివిధ విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

News June 3, 2024

జిల్లాలో 144 సెక్ష‌న్ అమ‌లు: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఓట్ల లెక్కింపు జ‌రిగే జూన్ 4న జిల్లాలో 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంతంగా పూర్తి చేసేందుకు, శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు ఈ సెక్ష‌న్‌ను విధిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ రోజు ఐదుగురు కంటే ఎక్కువ‌మంది గుమిగూడ‌కూడ‌ద‌ని, ఎవ‌రూ ఎటువంటి ఆయుధాల‌ను ధ‌రించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

News June 3, 2024

6 గంటలకల్లా సిబ్బంది వచ్చేయాలి: కలెక్టర్

image

విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఏలూరులో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు.

News June 3, 2024

నేటి నుంచి మద్యం విక్రయాలు బంద్: కలెక్టర్

image

 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డ్రైడేగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. 5వ తేదీ వరకు మద్యం విక్రయాలు నిర్వహించరాదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపుకు సహకరించాలి: పల్నాడు కలెక్టర్

image

ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలని, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లత్కర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఈ నెల 4న సార్వత్రిక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తీసుకున్న చర్యలు కౌంటింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ డిల్లీ రావ్

image

కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.ఆదివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డిల్లీరావు మాట్లాడుతూ.. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

News June 3, 2024

కౌంటింగ్‌కు నాలుగు అంచెల భద్రత: కడప ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఆదివారం కడప నగరం మౌంట్ ఫోర్ట్ స్కూల్లో పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కేంద్ర సాయుధ బలగాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో పోలీసుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు.

News June 3, 2024

బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కేంద్రంలోని కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 1 నుంచి 30 వరకు జరిగే ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. బాల కార్మికులు ఎక్కడైనా పనిచేసినట్లయితే పోలీసు నంబరు 100 లేదా చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.