Andhra Pradesh

News June 3, 2024

తిరుపతి: కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన

image

ఈవీఎంలు భద్రపరచిన తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ హాలులో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని సూచించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ జరిగేలా అధికారులు పని చేయాలన్నారు.

News June 3, 2024

సోమశిలకు వరద నీటి రాక

image

అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి వరద నీరు వస్తోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి జలాశయంలో 7.387 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 245 క్యూసెక్కుల వరద వస్తోంది. పెన్నా డెల్టాకు 200, దక్షిణ కాలువకు 5, ఉత్తర కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 70 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.

News June 2, 2024

కరకట్టపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చల్లపల్లి మండలం నడకుదురు వద్ద కరకట్టపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని గ్రామానికి చెందిన కుంభా నాంచారయ్య అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ.. వ్యాపారం చేసుకుని జీవించే నాంచారయ్య బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించి 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి మోపిదేవి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.

News June 2, 2024

విశాఖ: తంతడి బీచ్‌లో అక్కాచెల్లెళ్లు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రకాశం: కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని స్పందన హాలులో రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు.

News June 2, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా

image

స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. చిలకపాలెంలోని ఇంజ‌నీరింగ్ క‌ళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూంలను ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, ఎప్పీ రాధికతో పాటు నియోజకవర్గాల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహీల్, మాలతుస్ ఎస్.సంగమ్, అనుజ కుమార్ దాస్ తనిఖీ చేశారు. పలు అంశాలపై చర్చించారు.