Andhra Pradesh

News June 2, 2024

విశాఖ: తంతడి బీచ్‌లో అక్కాచెల్లెళ్లు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 2, 2024

తూర్పుగోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.

News June 2, 2024

ప్రకాశం: కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని స్పందన హాలులో రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు.

News June 2, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా

image

స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. చిలకపాలెంలోని ఇంజ‌నీరింగ్ క‌ళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూంలను ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, ఎప్పీ రాధికతో పాటు నియోజకవర్గాల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహీల్, మాలతుస్ ఎస్.సంగమ్, అనుజ కుమార్ దాస్ తనిఖీ చేశారు. పలు అంశాలపై చర్చించారు.

News June 2, 2024

కడప: కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు విధులను కేటాయించడం జరిగిందని కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గాల వారీగా విధులను కేటాయించే రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. 4న ఉదయం 5.30కి 3వ ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు.

News June 2, 2024

పుత్తూరు మాజీ MLA భార్య మృతి

image

తిరుపతి జిల్లా పుత్తూరు మాజీ MLA గంధమనేని శివయ్య సతీమణి పారిజాతమ్మ(84) ఆదివారం సాయంత్రం మృతిచెందారు. వృద్ధాప్య కారణాలతో పారిజాతమ్మ చెన్నైలోని తమ నివాసంలో కన్నుమూసినట్లు ఆమె కుమారుడు గౌతమ్ వెల్లడించారు. చెన్నైలోని కోడంబాకం ఎన్టీఆర్ స్ట్రీట్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. పిచ్చాటూరు(M) గోవర్ధనగిరికి చెందిన గంధమనేని శివయ్య 1972-77 మధ్య కాలంలో CPI తరఫున పుత్తూరు MLAగా గెలిచారు.

News June 2, 2024

కడప జిల్లాలో టీబీ మందుల కొరత లేదు: జేడీ

image

వైఎస్సార్ కడప జిల్లాలో ఎక్కడా టీబీ మందులకు కొరత లేదని టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో అవసరమైన టీబీ మందులు లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో అవసరమైన స్థాయిలో టీబీ నివారణ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 రోజులకు సరిపడా టీబీ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

News June 2, 2024

ప.గో: 3 రోజులు వైన్స్ బంద్.. మందుబాబుల క్యూ

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మద్యం బాబులకు టెన్షన్ పట్టుకుంది. సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేస్తుండటంతో ఆదివారమే మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు ఎగబడ్డారు. మరోవైపు లిక్కర్ మాల్స్ వద్ద మద్యం నిల్వలు నిండుకున్నాయి.

News June 2, 2024

మార్కాపురంలో కూటమి అభ్యర్థుల సమావేశం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి అభ్యర్థులు ఆదివారం మార్కాపురంలోని కందుల నారాయణరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. తాజా ఎన్నికల అంశాలు, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 2, 2024

‘అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం’

image

హనుమంతుడు ఆకాశగంగలోని అంజనాద్రిలో జన్మించినట్లు రాయలచెరువు శక్తి పీఠం అధిపతి మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమ‌ల‌ నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆక‌ట్టుకున్నాయి. ఈ సందర్భంగా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేశారు. అంజ‌నాదేవికి వాయుదేవుని కారణంగా తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపార‌న్నారు.