Andhra Pradesh

News June 2, 2024

రెండు వేల మందితో పటిష్ఠ భద్రత: ఎస్పీ కృష్ణకాంత్

image

జూన్ 4న రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 2, 2024

కుందుర్పి: 600 మందిపై బైండోవర్ కేసులు

image

ఎస్పీ ఆదేశాలు మేరకు కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా 600 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు కుందుర్పి ఎస్‌ఐ వెంకట స్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరన్న నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News June 2, 2024

గుంటూరు: కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

image

జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.

News June 2, 2024

శ్రీకాకుళం: సముద్రంలో స్నానానికి దిగి బాలుడు మృతి

image

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం సముద్ర స్థానానికి దిగి 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సారవకోట మండలం మర్రిపాడుకి చెందిన జన్ని ఉపేంద్ర(17) భావనపాడులో సముద్రంలో స్నానానికి దిగి ఈత కొడుతుండగా కెరటాలు లోపలికి లాక్కొని తీసుకువెళ్లడంతో మృతి చెందాడు. బాలుడు మృతి చెందాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు భావనపాడు చేరుకొని విలపించారు.

News June 2, 2024

చీరాల అభ్యర్థులకు నోటీసులు జారీ చేసిన డీఎస్పీ

image

ఓట్ల లెక్కింపు రోజు పాటించాల్సిన నియమ నిబంధనలపై పోటీలో ఉన్న అభ్యర్థులకు చీరాల DSP బేతపూడి ప్రసాద్ ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఆ రోజున నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నేతలు, కార్యకర్తలతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రత్యర్థులనుద్దేశించి ఎలాంటి విమర్శలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదన్నారు. అభ్యర్థుల ఇళ్లలో వారివారి కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఉండరాదన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

News June 2, 2024

గుత్తిలో సైబీరియన్ కొంగల సందడి

image

గుత్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం సైబీరియన్ కొంగలు సందడి చేశాయి. చాలా అరుదుగా కనిపించే ఈ కొంగలు కోర్టు ఆవరణలో చెట్లపై కనిపించాయి. దీంతో పక్షుల  ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణతో పాటు చుట్టుపక్కల  ప్రాంతాల్లో చెట్లపై కొంగలు కనిపించాయి. వాటి రాకతో కోర్టు ఆవరణం ఆహ్లాదకరంగా కనిపించింది.

News June 2, 2024

తుగ్గిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి ఆర్ఎస్ పెండేకలుకు వెళ్లే దారిలో ఉన్న తోట వద్దకు వెళ్లిన తలారి ఆదివారం మృతి చెంది కనిపించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

News June 2, 2024

ఒంగోలు: దర్గాలో పూజలు చేసిన టీడీపీ నేతలు

image

టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని కోరుతూ ఆదివారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువులోని దర్గాలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరిలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, గూడూరి తదితరులు దర్శించుకున్నారు.

News June 2, 2024

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

ఎన్నికల్లో గెలుపోటమలు సహజమని ఎవరు వ్యక్తి గతంగా తీసుకోవద్దని కలెక్టర్ సృజన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరన్న అతిక్రమిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 2, 2024

ఉమ్మడి ప.గో.లో కాయ్ రాజా కాయ్..!

image

ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం విడుదల కావడంతో ఉమ్మడి ప.గో జిల్లాలో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్.. అని కవ్విస్తూ పందేలు కాస్తున్నారు. కూటమిదే గెలుపంటూ కొందరు.. YCPదే మళ్లీ అధికారమంటూ ఇంకొందరు భారీగా బెట్టింగ్స్ పెడుతున్నట్లు సమాచారం. ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారంటే పందేలు ఎంతలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.