Andhra Pradesh

News June 2, 2024

గుత్తిలో సైబీరియన్ కొంగల సందడి

image

గుత్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం సైబీరియన్ కొంగలు సందడి చేశాయి. చాలా అరుదుగా కనిపించే ఈ కొంగలు కోర్టు ఆవరణలో చెట్లపై కనిపించాయి. దీంతో పక్షుల  ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణతో పాటు చుట్టుపక్కల  ప్రాంతాల్లో చెట్లపై కొంగలు కనిపించాయి. వాటి రాకతో కోర్టు ఆవరణం ఆహ్లాదకరంగా కనిపించింది.

News June 2, 2024

తుగ్గిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి ఆర్ఎస్ పెండేకలుకు వెళ్లే దారిలో ఉన్న తోట వద్దకు వెళ్లిన తలారి ఆదివారం మృతి చెంది కనిపించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

News June 2, 2024

ఒంగోలు: దర్గాలో పూజలు చేసిన టీడీపీ నేతలు

image

టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని కోరుతూ ఆదివారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువులోని దర్గాలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరిలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, గూడూరి తదితరులు దర్శించుకున్నారు.

News June 2, 2024

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

ఎన్నికల్లో గెలుపోటమలు సహజమని ఎవరు వ్యక్తి గతంగా తీసుకోవద్దని కలెక్టర్ సృజన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరన్న అతిక్రమిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 2, 2024

ఉమ్మడి ప.గో.లో కాయ్ రాజా కాయ్..!

image

ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం విడుదల కావడంతో ఉమ్మడి ప.గో జిల్లాలో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్.. అని కవ్విస్తూ పందేలు కాస్తున్నారు. కూటమిదే గెలుపంటూ కొందరు.. YCPదే మళ్లీ అధికారమంటూ ఇంకొందరు భారీగా బెట్టింగ్స్ పెడుతున్నట్లు సమాచారం. ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారంటే పందేలు ఎంతలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

News June 2, 2024

మచిలీపట్నం: కౌంటింగ్ హాల్లో గందరగోళం సృష్టిస్తే చర్యలు

image

ఈ నెల 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే, గందరగోళం సృష్టిస్తే తక్షణమే బయటకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంతో కలిసి కలెక్టరేట్‌లో ఆర్ఓలు, డీఎస్పీలతో ఓట్ల లెక్కింపు, శాంతి భద్రతల పర్యవేక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News June 2, 2024

శ్రీకాకుళం: పాము కాటుతో బాలుడు మృతి

image

కంచిలి మండలం బొగాబెని గ్రామంలో 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్ పాము కాటుతో మృతి చెందాడు. మెడపై పాము కాట్లు కనిపించడంతో బాలుడి తాత వెంటనే సోంపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News June 2, 2024

ఎల్లుండి గూడూరు నిమ్మ మార్కెట్‌కు సెలవు

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల రోజు తమకు సెలవు కావాలని గూడూరు నిమ్మ మార్కెట్ లోడింగ్ కూలీలు కోరారు. ఈ మేరకు నిమ్మ మార్కెట్ అసోసియేషన్ సెలవు ప్రకటించింది. రైతులు, ఆటో కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని అసోసియేషన్ సభ్యులు సూచించారు.

News June 2, 2024

యనమలకుదురులో గర్భిణి సూసైడ్

image

విజయవాడ శివారు యనమలకుదురులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కావ్య అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కావ్య ఐదు నెలల గర్భవతిగా ఉందని ఇటీవల భర్త స్కానింగ్ చేయించాడు. ఆడపిల్లని తేలడంతో భర్త అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అది ఇష్టంలేని కావ్య ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో 2500 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ

image

ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఎస్పీ తెలిపారు. జిల్లాలో కేంద్ర బలగాలతో సహా 2500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా డే అండ్ నైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారని, 55 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గొడవలు సృష్టించిన, పాల్పడినవారు జిల్లా బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.