Andhra Pradesh

News June 2, 2024

పిఠాపురంలో పవన్‌ గెలిస్తే.. మెజారిటీ ఎంత..?

image

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆరా సంస్థ సర్వేతో పాటు ఇతర సర్వేల్లోనూ అదే చెప్పారు. దీంతో అందరి దృష్టి పవన్‌ మెజారిటీపై పడింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని కూటమి పార్టీ నేతలు చెబుతుండగా.. తమదే విజయం అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.
– మీ కామెంట్..?

News June 2, 2024

నెల్లూరు: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా, బోనకల్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమేనిపాడు గ్రామానికి చెందిన నాగూర్ బోనకల్ సమీపంలో నిర్మిస్తున్న మొక్కజొన్న పరిశ్రమలో 3 నెలలుగా పనిచేస్తున్నాడు. సూపర్వైజర్‌తో కలిసి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీట మునిగి చనిపోయాడు.

News June 2, 2024

శ్రీకాకుళం: మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజులు మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పోలీస్ అధికారి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( ఎస్ఈబీ) అదనపు ఎస్పీ డి.గంగాధరం తెలిపారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఎక్కడ మద్యం అక్రమ నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News June 2, 2024

గుంటూరు: ఏఎన్‌యూలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు ముమ్మరం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన టేబుల్స్ ఇతర సామాగ్రిని ఆదివారం అధికారులు సిద్ధం చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్‌కు సర్వ సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు. 

News June 2, 2024

కర్నూలు: రేపు, ఎల్లుండి మద్యం అమ్మకాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 4న జరగనున్న నేపథ్యంలో 3, 4వ తేదీల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డాక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం 4వ తేదీ మాత్రమే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు మూసివేయాలని ఆదేశిస్తూ కలెక్టర్ మరో ఉత్తర్వు జారీ చేశారు.

News June 2, 2024

నెల్లూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ టెన్షన్

image

సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు కేవలం 48 గంటల సమయమే మిగిలి ఉంది. గత ఎన్నికల కంటే ఈ దఫా జిల్లాలో 2.39 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం గెలుపుపై వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News June 2, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

డెంకాడ మండలం చింతలవలస సమీపంలోని బొడ్డవలస పెట్రోల్ బంక్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. చింతలవలసకు చెందిన శరత్ కుమార్ (26), శివ ప్రసాద్ (25) శనివారం రాత్రి బైక్‌పై భీమిలి నుంచి ఇంటికి వస్తుండగా చింతలవలస పెట్రోల్ బంక్ సమీపంలో ముందున్న వాహనాన్ని ఢీకొన్నారు. స్థానికుల సమాచారంతో శివ ప్రసాద్ తల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరూ మృతిచెందారు.

News June 2, 2024

రేగిడి: ఒడిశాలో వడదెబ్బతో పెద్దశిర్లాం వాసి మృతి

image

పెద్దశిర్లాం గ్రామానికి చెందిన అప్పలనాయుడు(35) ఇనుప ముక్కల (స్క్రాప్) వ్యాపారానికి గ్రామానికి చెందిన 13 మంది యువకులతో కలిసి ఇటీవల ఒడిశాలోని మల్కాన్ గిరి వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం మల్కాన్ గిరి నుంచి తన ద్విచక్రవాహనంపై సమీపంలోని గూడాలకు వెళ్లే క్రమంలో ఎండలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కుప్పకూలి చనిపోయినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News June 2, 2024

జంగారెడ్డిగూడెం: భారీ చేప

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం ఎర్ర కాలువ జలాశయంలో మత్స్యకారులకు ఆదివారం 30 కేజీల భారీ చేప చిక్కింది. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చేపలు కొనేందుకు ఎగబడ్డారు. దీంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ భారీ చేప చిక్కింది. దీనిని రూ.7500కు విక్రయించినట్లు వారు తెలిపారు.

News June 2, 2024

తిరుపతి: కౌంటింగ్ ఏజెంట్లు ఎలా కూర్చోవాలో తెలుసా..!

image

4న జరిగే ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి హాజరయ్యే పార్టీ ఏజెంట్లు ఎలా పడితే అలా కూర్చోవడం కుదరదని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా దేశ గుర్తింపు కలిగిన పార్టీ, రాష్ట్ర గుర్తింపు కలిగిన పార్టీ, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కూర్చోవడంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.