India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు చాపాడు మండల నరహరిపురం పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమిలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ఐ (మాల్కంబీ) క్రీడలలో జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు అండర్ 17 విభాగంలో వి. సుబ్బలక్ష్మి (10వ తరగతి), కె. మస్తాన్ వల్లి (9వ తరగతి) ఎంపిక అయ్యారని తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 17న క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ తెలిపారు. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.3 వేల నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
ద్రావిడ వర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 14 శాఖలో 62 అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు.
తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.
APCRDAకు GIS, RSA రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన Best User Organization అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన Esri India సంస్థ వార్షిక యూజర్ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజేంద్ర కుమార్ ఈ అవార్డును అందజేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని సృజనాత్మకతో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు లభించింది.
తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.
కర్నూలు మార్కెట్ యార్డులో గురువారం ఉదయం లెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అమ్మకానికి వచ్చిన ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా వారికి సహకరించాలన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
Sorry, no posts matched your criteria.