Andhra Pradesh

News June 2, 2024

ప్రజాతీర్పును అందరు గౌరవించాలి: డీకే బాలాజీ

image

కట్టుదిట్టమైన భద్రత మధ్య 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పేర్కొన్నారు. శనివారం మీడియా సెంటర్‌లో విలేకరులలో వారు మాట్లాడారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, ప్రజా తీర్పు అందరూ గౌరవించాలని కలెక్టర్‌ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

News June 2, 2024

ఒంగోలు: పొగాకు గరిష్ఠ ధర రూ.360

image

ఒంగోలు ఒకటో కొనుగోలు కేంద్రంలో శనివారం పొగాకు వేలాన్ని నిర్వహించారు. చిలకపాడు రైతులు 1,330 బేళ్లను తీసుకురాగా.. వ్యాపారులు 1,247 బేళ్లను కొనుగోలు చేశారు. కిలో గరిష్ఠ ధర రూ.360, కనిష్ఠం రూ.205.. సగటున రూ.296.06 లభించింది. వేలంలో మొత్తం 25 కంపెనీలు పాల్గొన్నాయి. బోర్డు సూపరింటెండెంట్ రవికాంత్ పర్యవేక్షించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వేలం నిర్వహకులు తెలిపారు.

News June 2, 2024

కడప: పోలింగ్ సిబ్బందికి రెండు ఇంక్రిమెంట్లు కట్

image

ఎన్నికల పోలింగ్ విధుల్లో అలసత్వం వహించిన 185 మంది పోలింగ్ సిబ్బందికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నట్లు కడప జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది.. మే 12, 13 తేదీల్లో పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించి ఎన్నికల ప్రక్రియ ఆలస్యానికి కారకులైన 185 మంది పోలింగ్ సిబ్బందికి ఇంక్రిమెంట్లు కట్ చేశామని తెలిపారు.

News June 2, 2024

కడప: కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

image

కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగి త్వరితగతిన ఫలితాలు వెల్లడి అయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, పాటించవలసిన నిబంధనలపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.

News June 2, 2024

ప్రకాశం: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

image

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు..వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఉమ్మడి ప్రకాశంలోని 12 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 9, YCPకి 2, ఒకటి టఫ్ ఫైట్ ఉంటుందని, కేకే సంస్థ కూటమి-11, YCP-1 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఇంతకీ మీ అంచనా ఏంటి..?

News June 2, 2024

బాధ్యతగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు బందోబస్తు విధులలో పాల్గొననున్న ఏఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు శనివారం ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ బందోబస్తులో పాటించవలసిన విధి విధానాలపై ఎస్పీ జీఆర్ రాధిక బ్రీఫింగ్ నిర్వహించారు. సిబ్బందికి కేటాయించిన పాయింట్‌లో బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News June 2, 2024

ఆదాయకుల ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు పడిగాపులు

image

కళ్యాణదుర్గం : ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలలో ప్రభుత్వ అధికారుల సంతకం కోసం కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కావడం లేదని విద్యార్థులు వాపోయారు. ఎన్నికల సాకుతో అధికారులు ఉదయం కార్యాలయానికి వచ్చి అరగంటలోపే వెళ్ళిపోతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నారు.

News June 2, 2024

ప.గో.: మరొక్క రోజే.. ఉత్కంఠ

image

రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఓ అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలిఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?

News June 2, 2024

కడప: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

image

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు..వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఉమ్మడి కడపలోని 10 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 2, వైసీపీకి 4, నాలుగు టఫ్ ఫైట్ ఉంటాయని, కేకే సంస్థ కూటమి-5, వైసీపీ-3 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఇంతకీ మీ అంచనా ఏంటి..?

News June 2, 2024

జూన్ 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజుతో కలిసి మలేరియా వ్యతిరేక మాసోత్సవ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరూ దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.