India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
APCRDAకు GIS, RSA రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన Best User Organization అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన Esri India సంస్థ వార్షిక యూజర్ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజేంద్ర కుమార్ ఈ అవార్డును అందజేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని సృజనాత్మకతో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు లభించింది.
తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.
కర్నూలు మార్కెట్ యార్డులో గురువారం ఉదయం లెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అమ్మకానికి వచ్చిన ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా వారికి సహకరించాలన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
నేపాల్‌లో చిక్కున్న AP వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను వెలగపూడిలోని సచివాలయం RTGSలో మంత్రులు అనిత, నారా లోకేశ్ సమీక్షిస్తున్నారు. నేటి సాయంత్రం లోగా AP వాసులను విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ, AP భవన్ అధికారులతో చర్చిస్తున్నారు. విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్వాగతం పలకాలని లోకేష్ ఆదేశించారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.
విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట కాల్పుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో లొంగిపొగా14 వరకు రిమాండ్ విధించారు. పలు ఆరోపణలతో ఆయన ఇది వరకే సస్పెండ్ అయ్యాడు. చేపల రాజేశ్‌పై కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా A-3గా నాయుడు ఉన్నాడు. కోర్టులో లొగిపోవడానికి ముందు విశాఖ సీపీకి ‘తాను ఏ తప్పూ చేయలేదని’ వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. సీఐ జీడీ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.