Andhra Pradesh

News June 1, 2024

బుగ్గన మరోసారి గెలుపు.. ఆరా సర్వే

image

గత నెల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బుగ్గన ఈసారి కూడా గెలుపు ఖాయమని చెప్పింది. 2014లో కేఈ కృష్ణమూర్తి, 2019లో కేఈ ప్రతాప్‌లపై గెలిచిన ఆయన.. ఈసారి టీడీపీ నుంచి బరిలో దిగిన కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి ఓటమి తప్పదని తేల్చి చెప్పింది.

News June 1, 2024

AARA సర్వే: RRR గెలుపు

image

కూటమి పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన భూపతిరాజు శ్రీనివాస శర్మ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన రఘురామకృష్ణరాజు సునాయాసంగా విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.

News June 1, 2024

AARA సర్వే: రాజమండ్రిలో పురంధరీశ్వరి గెలుపు డౌట్

image

కూటమి పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి గట్టిపోటీ ఎదుర్కోనున్నట్లు ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. కాగా ఇక్కడ ఆమె గెలుపు, ఓటమికి సమాన అవకాశాలు ఉండనున్నాయని పేర్కొంది.

News June 1, 2024

రోజా ఓడిపోబోతుంది: ఆరా

image

ఈసారి ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి ఖాయమని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో ఆమె స్పల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. తాజా ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆరా చెప్పడంతో.. పరోక్షంగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాను అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 1, 2024

చెన్నెకొత్తపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మవరం పట్టణం ఎల్సీకే పురానికి చెందిన గొల్ల నారాయణ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందిమల్ల కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై చెన్నెకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 1, 2024

కడప జిల్లాలో అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు!

image

ఉమ్మడి కడప జిల్లాలో పలువురు ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరెవరంటే..
* బిజివేముల వీరారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎల్ రవీంద్రనాథ్ రెడ్డి (6 సార్లు)
* నంద్యాల వరద రాజుల రెడ్డి(5 సార్లు)
* గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ప్రభావతమ్మ, శెట్టిపల్లి రఘురామిరెడ్డి (4 సార్లు).
– వీరిలో ప్రస్తుతం గడికోట, కొరముట్ల, శెట్టిపల్లి, వరదరాజుల రెడ్డి బరిలో ఉన్నారు.

News June 1, 2024

శ్రీకాకుళం: ఈ నెల 3, 4 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. నౌపడ-పూండీ మెయిన్ లైన్‌లో వంతెన పనులు నేపథ్యంలో 3వ తేదీన పలాస-విశాఖ(07470)ప్యాసెంజర్, విశాఖ-గునుపూర్ (08522) ప్యాసెంజర్, విశాఖ- బరంపురం(18526), 4వ తేదీన బరంపురం-విశాఖపట్నం(18525) ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.స్యాందీప్ పేర్కొన్నారు.

News June 1, 2024

తూ.గో.: ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్: SP

image

ఈ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఎన్నికల అధికారులు కొత్త నిబంధన విధించారు. ఏజెంట్లకు ఎన్నడూ లేని విధంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే.. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

News June 1, 2024

అనంతపురం జిల్లాలో 6వేల మంది బైండోవర్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఆరు వేల మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. జూన్ 4న జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఏజెంట్లుగా వెళ్లే వారికి ఐడి కార్డు లేకుంటే అనుమతించమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల నివాసులందరికి నోటీసులు అందించామని వెల్లడించారు.

News June 1, 2024

గుంటూరు: నాగార్జున వర్సిటీకి రెండు రోజులు సెలవులు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.