Andhra Pradesh

News June 1, 2024

విజయనగరం: పూసపాటిరేగ మండలంలో అత్యధిక వర్షపాతం

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జిల్లాలో అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, విజయనగరంలో 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శృంగవరపుకోట మండలంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

News June 1, 2024

నాయుడుపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బైక్‌ ఢీకొంది.  ఘటనలో సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన అరిషిత్ (21) మృతి చెందగా, శరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. శరత్ కుమార్ రెడ్డిని నాయుడుపేట పభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News June 1, 2024

అనంతపురంలో హలో రైతన్న కార్యక్రమం

image

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7: 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ , రేకులకుంట వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, టెలిఫోన్08554 225533 ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News June 1, 2024

తిరుమల శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం

image

తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.

News June 1, 2024

శ్రీశైలం: ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు చర్యలు

image

శ్రీశైల మహా క్షేత్రంలోని టోల్‌గేట్ , నందీశ్వర డార్మెటరీ వద్ద ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి సరిహద్దులలో పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఫారెస్ట్ ల్యాండ్‌ను ఆక్రమించకుండా ఉండడం కోసం ఈ పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ నరసింహులు తెలిపారు.

News June 1, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి

image

చీమకుర్తి మండలం పడమటి నాయుడుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఐజాక్ (12) తన తండ్రి దగ్గర బైకు తీసుకొని స్నేహితులతో అధిక స్పీడుతో నడపగా, కంట్రోల్ తప్పి కరెంటు పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఐజాక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు చందు, ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చీమకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

News June 1, 2024

పెనుగంచిప్రోలు: అనుమానాస్పదంగా ఇద్దరి మృతి

image

పెనుగంచిప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరగా, లారీ డ్రైవర్ అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వచ్చినట్లు సమాచారం. జగ్గయ్యపేటలో ఈ ఇద్దరు మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

News June 1, 2024

చింతకొమ్మదిన్నె: అన్నను కత్తితో పొడిచిన తమ్ముడు

image

చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అక్బర్ (40) అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేయించుకుంటున్న సమయంలో తమ్ముడు భాషాఖాన్ (38)కి అన్నకి స్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో అన్నను తమ్ముడు కత్తితో పొడివగా, తప్పించుకొనే క్రమంలో చేతికి కూడా గాయమైంది. దీంతో కుటుంబీకులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.

News June 1, 2024

నేడు విజయనగరం జిల్లా అవతరణ దినోత్సవం

image

ఉమ్మడి విజయనగరం జిల్లా 1 జూన్ 1979 న అవతరించింది. తొలత విశాఖ జిల్లా నుంచి విజయనగరం, గజపతినగరం, S.KOTA , భోగాపురం తాలూకాలతో…శ్రీకాకుళంలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లితో కలిసి 9 జిల్లాలు ఏర్పడ్డాయి. 1979లో విజయనగరం, S. KOTA, బొబ్బిలి విభజనతో నెల్లిమర్ల , వియ్యంపేట, బాడంగి మూడు తాలూకాలను జోడించారు.1985 లో తాలూకాలు, ఫిర్కాస్ స్థానంలో 34 రెవెన్యూ మండలాలను భర్తీ చేశారు.

News June 1, 2024

దాచేపల్లి ఉపాధ్యాయుడిని సన్మానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం

image

దాచేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ వలిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సన్మానించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ మస్తాన్ వలీ గుంటూరులో జరిగిన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా మస్తాన్ వలి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.