Andhra Pradesh

News June 1, 2024

కడప: రూ.1.50 కోట్లు స్వాధీనం

image

ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి నుంచి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చింతకొమ్మదిన్నె మం, జయరాజ్ గార్డెన్స్ వద్ద చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన తిరుమలయ్య అనే బంగారు వ్యాపారి ఈ నగదును చెన్సైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. బిల్లులు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించారు.

News June 1, 2024

తూ.గో: విద్యుత్ కోతలతో ఆక్వా రైతుల గగ్గోలు

image

అప్రకటిత విద్యుత్‌ కోతలు ఉమ్మడి తూ.గో జిల్లాలోని రొయ్యల రైతులకు నష్టాలను మిగుల్చుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అదనపు భారం పడుతోంది. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూ.గో జిల్లాల పరిధిలో 75వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ ఏడాది లాభాల పంట పండిస్తుందనే ఆశతో మార్చిలో రైతులు ఉత్సాహంగా రొయ్యల సాగు ప్రారంభించారు. విద్యుత్‌ కోతలు తమ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయని వారు వాపోతున్నారు.

News June 1, 2024

అనంత జిల్లాకు వర్ష సూచన

image

అనంతపురం జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వారు పేర్కొన్నారు.

News June 1, 2024

బడితెరిచిన రోజునే విద్యా కానుక

image

బడితెరిచిన రోజునే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు 14,66,883 పాఠ్య పుస్తకాల అవసరం కాగా మే 31 నాటికి 9,16,691 పుస్తకాలు వచ్చాయి. వీటిలో 7,03,154(76 శాతం) స్టాక్ పాయింట్లకు సరఫరా చేశారు. అల్లూరి జిల్లాకు 45 శాతం, అనకాపల్లి జిల్లాకు 48 శాతం, విశాఖ జిల్లాకు 47% పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు.

News June 1, 2024

గరివిడి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

గరివిడి మండలం ఎం.దుగ్గివలస గ్రామానికి చెందిన దాసరి సత్యం (38) మనస్సు సరిగ్గా లేకపోవడంతో ఆతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.గురువారంఉదయం బయటకు వెళ్ళాడు. రమణఅనే వ్యక్తి తన కుమారుడు చీపురుపల్లి వద్ద పడిపోయినట్టు సమాచారం అందజేశారు. వెంటనే కుటుంబసభ్యులు ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మరణించినట్లు తల్లి తెలియజేసారని ఎస్సై కె.కె నాయుడు తెలిపారు

News June 1, 2024

నేడు కృష్ణా జిల్లాలో వర్షాలు

image

కృష్ణా జిల్లాలో రాగల 3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో టవర్స్, ఐరన్ పోల్స్, చెట్ల కింద ఉండకూడదని సూచించింది. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

News June 1, 2024

5PM లోపు పూర్తి ఫలితాలు వెల్లడిస్తాం: కలెక్టర్

image

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. 4వ తేదీన సాయంత్రం 5గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొత్తం 16 నుంచి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున, అసెంబ్లీ, ఎంపీకి కలిపి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News June 1, 2024

కురిచేడు: బీరు సీసాతో దాడి.. వ్యక్తి మృతి

image

జూదం ఆడుతూ వివాదం చెలరేగి జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. కురిచేడు మండలం బోధనంపాడులో 108 వాహన డ్రైవర్ అబుదావలి, గోవింద రమేశ్, చింత పిచ్చెలు మద్యం తాగి జూదం ఆడుతున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. అబుదావలి గొంతు మీద రమేశ్, పిచ్చేలు కాలు వేసి తొక్కి బీరు సీసాతో దాడి చేశారు. దీంతో అబుదావలి తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు.

News June 1, 2024

మృతిపై అనుమానం.. ఖననం చేసిన 3రోజులకు పోస్టుమార్టం

image

ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం కుండాడలో 3 రోజుల కింద ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుండాడకు చెందిన కుండ్ల లీలాప్రసాద్‌రెడ్డి(40) మే 27న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. అతడి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం కావడంతో VRO ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News June 1, 2024

చిలకలూరిపేట: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

image

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్లే ఓ ట్రావెల్ బస్సు లింగంగుంట్ల వద్ద కరెంట్ స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.