Andhra Pradesh

News June 1, 2024

జమ్మలమడుగులో ఆరుగురు జిల్లా బహిష్కరణ

image

ఈనెల 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో కడప జిల్లాలో అల్లర్లు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పోలీసులు పలు చర్యలు తీసుకోనున్నారు. జమ్మలమడుగులో ఆరుగురిని జిల్లా నుంచి బహిష్కరణ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కడప, బద్వేలు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే కొందరిని నేతలకు నోటీసులు ఇచ్చారు. ట్రబుల్ మాంగర్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 1, 2024

అనంతపురం అర్బన్‌లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మే 3 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అందులో ఆనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 6,971 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. రెండవ స్థానంలో రాప్తాడు 4,338 ఓట్లు నమోదు అయ్యాయి. రాయదుర్గం 1,671, ఉరవకొండ 2,544, గుంతకల్ 3,612, తాడిపత్రి 2,702, సింగనమల 2,450, కళ్యాణదుర్గం 2,612 ఓట్లు నమోదు అయ్యాయి.

News June 1, 2024

నేటి నుంచి రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు

image

శ్రీకాకుళం జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 3, 358 అంగన్వాడీ కేంద్రాలు శనివారం నుంచి రెండు పూటలు పనిచేయనున్నాయి. వేసవి నేపథ్యంలో మే నెలలో ఒక్క పూట మాత్రమే కేంద్రాలు నిర్వహించారు. శనివారం నుంచి రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయని సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఉన్నతాధికారులు సూచించారు.

News June 1, 2024

కర్నూలు: రాయలసీమ వర్సిటీకి వరుస సెలవులు

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ నాగుల అంకన్న తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వర్సిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారని తెలిపారు. వర్సిటీలోకి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు.

News June 1, 2024

ఒంగోలులో కౌంటింగ్.. వాటికి భలే గిరాకీ

image

ప్రస్తుత చర్చంతా ఎన్నికల ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి. ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారంలో ఉండేది ఎవరా అని చర్చించుకుంటున్నారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో 4న ఓట్ల లెక్కింపు చేపట్టనుండటంతో చుట్టు పక్కల లాడ్జీలకు గిరాకీ పెరిగింది. ఒంగోలు సమీపంలో సమారు 50 వరకు హోటళ్లు, లాడ్జిలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులు ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు.

News June 1, 2024

తిరుపతి: బీ-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

రెండేళ్ల బీ-ఫార్మసీ (2024-25) ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వై.ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. బైపీసీ, ఎంపీసీ చదివిన విద్యార్థులు https://apsbtet.in/pharmacy వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 70367 25872 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News June 1, 2024

చిత్తూరు: 2న క్రికెట్ జట్ల ఎంపిక

image

చిత్తూరు జిల్లా బాయ్స్, గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో 2024-25 సీజన్ కు సంబంధించి అండర్-16 (బాలుర), అండర్-23 (పురుషులు) క్రికెట్ జట్ల ఎంపికలు ఈ నెల 2న నిర్వహించనున్నట్లు కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని మైదానంలో ఉదయం ఎనిమిది గంటలకు బాలురకు, మధ్యాహ్నం రెండు గంటలకు పురుషులకు ఎంపిక జరుగుతాయన్నారు.

News June 1, 2024

NLR: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏటా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందించే పద్మా పురస్కారాల కోసం క్రీడల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించిన అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే యతిరాజ్ తెలిపారు. అర్హులైన క్రీడాకారులు www.padmaawards.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా sportsinap@gmail.com మెయిల్ అడ్రస్‌కు ఆగస్టు ఒకటో తేదీలోపు పంపాలని కోరారు.

News June 1, 2024

ఏలూరు: ఒంటరితనం భరించలేక యువకుడి సూసైడ్

image

ఏలూరు జిల్లా ఆదివారపుపేట మసీదు రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ రెహమాన్(21) మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించగా.. అమ్మమ్మ వద్ద ఉంటూ నగరంలోని ఓ షోరూంలో మెకానిక్‌గా పనిచేసేవాడు. కొద్ది నెలల కిందట అమ్మమ్మ సైతం మృతి చెందడంతో ఒంటరిగా మారి మానసిక ఆందోళనకు గురయ్యాడు. జీవితంపై విరక్తితో రెహమాన్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News June 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి కాలేజీలు పునః ప్రారంభం

image

నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని జూనియర్ కాలేజీలు శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. నేటి నుంచే కళాశాలలో క్లాసులు కూడా మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశిత వార్షిక క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 168 జూనియర్ కళాశాలలో ఉండగా ఇందులో 38 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.