Andhra Pradesh

News June 1, 2024

ప్రజలు అపోహలను నమ్మొద్దు: DSP ఉమామహేశ్వర రెడ్డి

image

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫలితాలు, అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకాళహస్తి డి.ఎస్.పి ఉమామహేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News June 1, 2024

కౌంటింగ్‌కు ఆటంకం కలిగించాలన్న యోచనలో వైసీపీ: వర్మ

image

కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించాలన్న యోచనలో వైసీపీ ఉందని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పిఠాపురంలో ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లను, గొడవలు సృష్టించే వారిని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా పెడుతోందని ఆరోపించారు. ఓడిపోతున్నామనే భయంతో జగన్ కొత్త నాటకాలకు తెర తీస్తున్నారన్నారు. కాకినాడ ఎస్పీ దృష్టి సారించాలని కోరారు.

News June 1, 2024

కడప, నెల్లూరు క్రీడాకారులు సెంచరీ నమోదు

image

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం నెల్లూరు జట్టు విజయం సాధించాయి. నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కడప జట్టుపై విజయం సాధించింది. కడప బ్యాట్స్‌మెన్ వంశీకృష్ణ 100 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. నెల్లూరు బ్యాట్స్‌మెన్ ఫర్హాద్ ఖాద్రి 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి నెల్లూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

News June 1, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బాధ్యతగా లెక్కించండి: కలెక్టర్

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా, సత్వరమే చేయడం కోసం సహాయకంగా నియమించిన ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

News June 1, 2024

జూన్ 3,4 తేదీలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌కు సెలవు

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు జూన్ నెల 3, 4వ తేదీల్లో సెలవు ప్రకటించినట్లు ప్రిన్సిపల్ సర్కులర్ జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కళాశాలలోని పలు కార్యాలయాలు, విభాగాలను ఎన్నికల కమిషన్ తమ ఆధీనంలోకి తీసుకుని ప్రాంగణాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఎన్నికల అనంతరం ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచింది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో 3,4 తేదీల్లో సెలవు ప్రకటించారు.

News June 1, 2024

విజయనగరం: పెట్రోల్ బంకులకు నోటీసులు జారి

image

జిల్లాలో వున్న పెట్రోల్ బంకులలో ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్‌లకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశించింది. జిల్లాలో ఉన్న ప్రతి బంక్‌లో నోటీసులు జారీ చేశామని విజయనగరం ఒకటవ పట్టణ సీఐ బీ.వెంకటరావు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లలో జనరేటర్లకు తప్పని సరిగా అనుమతి పొందాలన్నారు. బంకు యజమానులు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. లేనియెడల చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 1, 2024

శ్రీకాకుళం: పాలిసెట్ కౌన్సిలింగ్‌లో మార్పులు

image

పాలీసెట్ కౌన్సిలింగ్‌ను ఎన్నికల ఫలితాల దృష్ట్యా పలు మార్పులు చేశారు. ఈ మేరకు జూన్ 3న జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 6న జరుగుతుంది. ప్రత్యేక రిజర్వేషన్లు వర్తించే వారికి సైతం ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. పాత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు ఎంట్రీకి ఈనెల 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుతం జూన్ 7 నుంచి 10 వరకు మార్పు చేశారు. అలాట్మెంట్‌ల ప్రకటన జూన్‌ 7 నుంచి 13వ తేదీకి మార్చారు.

News June 1, 2024

ప.గో. జిల్లా RTC ఆర్‌ఎంగా NVR వరప్రసాద్

image

APSRTC ప.గో.జిల్లా ప్రజారవాణ అధికారిగా ఎన్వీఆర్ వరప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వీరయ్య చౌదరి పదవీవిరమణ చేయడంతో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్యచౌదరికి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

News June 1, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్- BLISC డిగ్రీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 31, 2024

కౌంటింగ్‌ విధులపై నోడల్ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

image

కౌంటింగ్‌ ప్రక్రియ, అధికారుల చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన కీలక దశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరూ ఏయే విధులు నిర్వహించాలనే క్రమంలో ఉత్తర్వులు జారీ చేశామన్నారు.