Andhra Pradesh

News May 31, 2024

తూ.గో.: ఐదుకి చేరిన మృతుల సంఖ్య

image

గత ఏప్రిల్ 29వ తేదీన యానాం నుంచి డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు వస్తున్న ఆటో భట్నవిల్లి దగ్గర లారీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు యువకులు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందారు. కాగా నగరం పితానివారి మెరకకి చెందిన మాదాసి ప్రశాంత్ కుమార్ (17) శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.

News May 31, 2024

VZM: సీతం వద్ద ప్రమాదానికి గురైన అంబులెన్స్

image

జిల్లాలోని సీతం కళాశాల సమీపంలో ఓ అంబులెన్సు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకువస్తున్న సమయంలో సీతం కళాశాల వద్ద లారీను తప్పించబోయి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 31, 2024

నెల్లిమర్ల కూటమిలో బకెట్ సింబల్ కలవరం

image

నెల్లిమర్లలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వైసీపీ-జనసేన మధ్య హోరాహోరీగా జరిగాయి. వైసీపీ తరఫున సిట్టింగ్ MLA బడ్డుకొండ పోటీలో నిలవగా.. కూటమి అభ్యర్థిగా నాగ మాధవి బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నప్పటికీ, కూటమి శ్రేణుల్లో మాత్రం బకెట్ గుర్తు కలవర పెడుతోందని సమాచారం. ఈవీఎంలో తొమ్మిదో నంబర్ బకెట్ గుర్తు కాగా.. పదో నంబర్ గ్లాస్ గుర్తు రావడమే ఈ కలవరానికి కారణంగా తెలుస్తోంది.

News May 31, 2024

కారంచేడు: లిఫ్ట్ అడిగాడు.. ఫోన్ కొట్టేశాడు

image

చీరాలలో ఓ వ్యక్తి పర్చూరు వరకు లిఫ్ట్ కావాలని లారీని ఆపాడు. లారీ డ్రైవర్ మానవతా దృక్పథంతో అతడిని ఎక్కించుకున్నాడు. కారంచేడు కాలువ సెంటర్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ మంచినీటి కోసం కిందకి దిగాడు. అదే అదునుగా భావించి లారీలో ఉన్న డ్రైవర్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెతుకుతుండగా కొద్ది దూరంలో ఫోన్ పడేసి పరారయ్యాడు.

News May 31, 2024

అమిత్‌షాకు వీడ్కోలు పలికిన బీజేపీ నేత కోలా ఆనంద్

image

రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు వీడ్కోలు పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఢిల్లీ వెళుతున్న అమిత్ షాను తిరుపతి, శ్రీకాళహస్తి నేతలు కలిశారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని నినాదాలు చేశారు.

News May 31, 2024

ప.గో.: తల్లి మందలింపు.. కొడుకు SUICIDE

image

తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. కొవ్వూరు టౌన్ SI జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు పట్టణం 2వ వార్డుకు చెందిన ఆనంద బాబు (32) తల్లి మహాలక్ష్మిని డబ్బులు కావాలని అడిగాడు. అయితే డబ్బులు దుబారాగా ఖర్చు చేస్తున్నావని ఆమె మందలించింది. దీంతో అతడు స్థానిక ఎరిణమ్మ ఇసుక ర్యాంపు వద్ద ఉరేసుకొని చనిపోయాడు. తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు నమోదుచేసినట్లు వివరించారు. 

News May 31, 2024

ఆనంద్ దేవరకొండతో సినిమ తీసిన పలమనేరు వాసి

image

బేబి సినిమా ఫేం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గంగం గణేషా శుక్రవారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాను చూసిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా డైరెక్టర్ ఉదయ్ బొమ్మి శెట్టి తల్లిదండ్రులు పలమనేరు వాసులు కావడంతో వారు సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినిమా రంగంలో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.

News May 31, 2024

నంద్యాల జిల్లా అంతటా పోలీసు నిఘా

image

ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా అంతటా నిఘా ఉంచామన్నారు.

News May 31, 2024

3,600 మందితో పటిష్ఠ భధ్రత: నెల్లూరు కలెక్టర్

image

ఓట్ల కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 31, 2024

తాడిపత్రిలో కొనసాగుతున్న అరెస్టులు

image

తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టుచేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గౌస్ బాషా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం ఈ అల్లర్ల కేసులో 140 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.