India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేపాల్‌లో చిక్కున్న AP వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను వెలగపూడిలోని సచివాలయం RTGSలో మంత్రులు అనిత, నారా లోకేశ్ సమీక్షిస్తున్నారు. నేటి సాయంత్రం లోగా AP వాసులను విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ, AP భవన్ అధికారులతో చర్చిస్తున్నారు. విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్వాగతం పలకాలని లోకేష్ ఆదేశించారు.
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.
విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట కాల్పుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో లొంగిపొగా14 వరకు రిమాండ్ విధించారు. పలు ఆరోపణలతో ఆయన ఇది వరకే సస్పెండ్ అయ్యాడు. చేపల రాజేశ్‌పై కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా A-3గా నాయుడు ఉన్నాడు. కోర్టులో లొగిపోవడానికి ముందు విశాఖ సీపీకి ‘తాను ఏ తప్పూ చేయలేదని’ వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. సీఐ జీడీ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (NCAP) కింద జరిగిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో గుంటూరు నగరం అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సర్వేలో గుంటూరు దేశవ్యాప్తంగా ఆరో ర్యాంకును సాధించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి టాప్ టెన్‌లో స్థానం పొందిన ఏకైక నగరం గుంటూరు. ఇది గుంటూరు జిల్లా ప్రజలకు గర్వకారణమని అధికారులు తెలిపారు.
కృష్ణా జిల్లాలో రోజురోజుకు గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గన్నవరం, బాపులపాడులలో పట్టపగలు మహిళల గొలుసులు లాక్కుని దొంగలు పారిపోయారు. ప్రస్తుతం బంగారం గ్రాము ధర రూ.10 వేలు దాటడంతో మహిళలు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ క్రమంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, బస్సులలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో 185 Jr.కళాశాలలు ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 100 రోజులు గడిచినా ల్యాబ్‌ల బూజు దులిపే పనిలేదు. రసాయనాలు లేక, సదుపాయాలు లేని పరిస్థితి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కేవలం థియరీపై దృష్టి పెడుతున్నారు. పరీక్షలకు ముందు ల్యాబ్‌లు తెరిచి పూర్తి మార్కులు వేసి దగాకు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.
దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.916 కోట్లతో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూ సేకరణ, OLS సర్వే పూర్తి చేయడం జిల్లా యంత్రాంగంపై ఉంది. AAI అధికారులు కొండలు తొలగింపు, కాలువ మార్పు, చెరువు పూడ్చివేత వంటి మార్పులు సూచించారు. మొత్తం 1379 ఎకరాల్లో 669 ఎకరాలు సేకరించారు. దామవరం మేత పోరంబోకు భూములు, కౌరు గుంట రైతులకు పరిహారం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి.
పలమనేరు నుంచి చిత్తూరు వెళ్లే ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ (ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి) అక్కడికక్కడే మృతి చెందారు. వృత్తి నిమిత్తం బైక్ పై ప్రయాణిస్తుండగా, మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పవన్ మరణంతో అతడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.