Andhra Pradesh

News May 31, 2024

గుర్తింపు కార్డు ఉంటేనే కౌంటింగ్ హాల్లోకి ప్రవేశం: విశాఖ కలెక్టర్

image

జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత రిటర్న్ అధికారి జారీ చేసిన ఐడీ కార్డ్, పాస్ ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. కౌంటింగ్ కేంద్రం లోపలకు మొబైల్ ఫోన్ అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే శిక్షకు అర్హులవుతారని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు అమలు అవుతాయి.

News May 31, 2024

అన్నమయ్య: పెంచలయ్య, రాజారెడ్డిపై జిల్లా బహిష్కరణ

image

అన్నమయ్య జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కట్లుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇద్దరిపై జిల్లా బహిష్కరణ చర్యలు చేపట్టారు. రాజంపేట జడ్పీటీసీ భర్త దాసరి పెంచలయ్య, పుల్లంపేట రాజారెడ్డిపై కౌంటింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో అడుగు పెట్టవద్దన్నారు. అలాగే రాజంపేట, కోడూరులో 60 మందికి గృహనిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.

News May 31, 2024

అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలి: ఎస్పీ వకుల్ జిందాల్

image

కౌంటింగ్ రోజు ఏర్పడే అవాంఛనీయ ఘటనలను ఆదిలోనే కట్టడి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 5 డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News May 31, 2024

కృష్ణా జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం

image

రేపు శనివారం కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

News May 31, 2024

కందుకూరు: పోలీస్ స్టేషన్‌కు చేరిన సచివాలయం ప్రేమ

image

కందుకూరు 8 వార్డు సచివాలయంలో పనిచేస్తున్న తనను అదే సచివాలయంలో విధులు నిర్వహించే అడ్మిన్ నమ్మించి మోసం చేశాడని మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తి ఆమెతో రెండు ఏళ్ళ పాటు ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోమని అడిగితే మాట దాటేస్తూ..  పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పడంతో చేసేది లేక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.

News May 31, 2024

జిల్లాలో 1,64,452 పెన్షన్ దారులు: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో 1,64,452 మంది పెన్షన్ దారులు ఉండగా వీరిలో డీబీటీ పద్ధతి ద్వారా 1,17,487 మందికి పెన్షన్ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జూన్ 1వ తేదీన నగదు జమవుతుందని చెప్పారు. మిగిలిన 46,965 మంది పెన్షన్ దారుల ఇంటి వద్దకే ప్రభుత్వ యంత్రాంగం పెన్షన్ రూపంలో అందిస్తుందని చెప్పారు. లబ్ధిదారులు ఎక్కడకీ వెళ్లనవసరం లేదని కలక్టర్ వెల్లడించారు.

News May 31, 2024

కర్నూలు: తల్లి మృతి.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి మరణించడంతో బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పగిడ్యాల మండలం ఎస్సీ కాలనీకి గుండెపోగు మహేశ్ అనే యువకుడి తల్లి అనారోగ్యంతో మూడు రోజుల కిందట మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 31, 2024

జూన్ 1 నుంచి గుంటూర్ ఫాస్ట్ పాసెంజర్ పునరుద్ధరణ

image

నరసాపురం- గుంటూరు మధ్య 17282 నంబర్‌తో నడిచే ఫాస్ట్ పాసెంజర్ రైలును జూన్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ రైలు గుంటూరు వరకు వెళ్లదని విజయవాడ వరకే మాత్రమే వెళ్తుందన్నారు. రైలు ఉదయం 6:05 గంటలకు నరసాపురంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. 17281 నంబర్‌తో ఇదే రైలు సాయంత్రం 6:50కి విజయవాడలో బయలుదేరి రాత్రి 10:30కు నరసాపురం చేరనుందన్నారు.

News May 31, 2024

ఐదేళ్లు పోలీసులు ఎవరి కనుసన్నల్లో పని చేశారు : పరిటాల సునీత

image

ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పరిటాల సునీత విమర్శించారు. రామగిరి మండలం వెంకటాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కనుసన్నల్లో పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.

News May 31, 2024

విజయవాడ: కృష్ణా నదిలోకి దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

ప్రకాశం బ్యారేజీ 68వ కానా పైనుంచి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు ఆమెను బయటకు తీశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.