Andhra Pradesh

News May 31, 2024

కర్నూలు: తల్లి మృతి.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి మరణించడంతో బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పగిడ్యాల మండలం ఎస్సీ కాలనీకి గుండెపోగు మహేశ్ అనే యువకుడి తల్లి అనారోగ్యంతో మూడు రోజుల కిందట మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 31, 2024

జూన్ 1 నుంచి గుంటూర్ ఫాస్ట్ పాసెంజర్ పునరుద్ధరణ

image

నరసాపురం- గుంటూరు మధ్య 17282 నంబర్‌తో నడిచే ఫాస్ట్ పాసెంజర్ రైలును జూన్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ రైలు గుంటూరు వరకు వెళ్లదని విజయవాడ వరకే మాత్రమే వెళ్తుందన్నారు. రైలు ఉదయం 6:05 గంటలకు నరసాపురంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. 17281 నంబర్‌తో ఇదే రైలు సాయంత్రం 6:50కి విజయవాడలో బయలుదేరి రాత్రి 10:30కు నరసాపురం చేరనుందన్నారు.

News May 31, 2024

ఐదేళ్లు పోలీసులు ఎవరి కనుసన్నల్లో పని చేశారు : పరిటాల సునీత

image

ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పరిటాల సునీత విమర్శించారు. రామగిరి మండలం వెంకటాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కనుసన్నల్లో పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.

News May 31, 2024

విజయవాడ: కృష్ణా నదిలోకి దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

ప్రకాశం బ్యారేజీ 68వ కానా పైనుంచి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు ఆమెను బయటకు తీశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

కృష్ణా: ముగిసిన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

image

పదవ తరగతి సప్లిమెంటరీ అడ్వాన్స్‌డ్ పరీక్షలు కృష్ణా జిల్లాలో ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సోషల్ స్టడీస్ పరీక్షకు 1950 మంది విద్యార్థులకు 594 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన 07 కేంద్రాలను సందర్శించగా ఒక్కమాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

News May 31, 2024

తిరుపతి: 12 నుంచి సెమిస్టర్ పరీక్షలు

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 31, 2024

నంద్యాల: ఈవీఎం స్ట్రాంగ్ రూంల చుట్టుపక్కల రెడ్ జోన్

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి RGM, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

News May 31, 2024

నెల్లూరులో జూన్ 6 వరకు 144 సెక్షన్

image

ఓట్ల లెక్కింపును ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడడం, చట్ట విరుద్ధమైన సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

News May 31, 2024

పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన ఏల్చూరు యువతి

image

మంగళగిరిలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు 11వ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన పరుచూరి కుమారి నంద పాల్గొని సత్తా చాటింది. సీనియర్ మహిళల 76 కేజీల పవర్ లిప్టింగ్ విభాగంలో, అలాగే బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని రెండు సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమెను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

News May 31, 2024

జస్టిస్ ఏపీ శేష సాయి సేవలు ప్రసంశనీయం: చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

image

ఏపీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేష సాయి అందించిన సేవలు ప్రసంశనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నశేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.