Andhra Pradesh

News May 31, 2024

జేఎన్టీయూ చుట్టూ మూడు కిలోమీటర్లు రెడ్ జోన్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్టీయూలో నిర్వహిస్తున్నందున జేఎన్టీయూ నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూను ప్రత్యేక పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News May 31, 2024

పెన్షన్ల పంపిణీకి పటిష్ఠ చర్యలు: ఢిల్లీరావు

image

పెన్ష‌న్ పంపిణీ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా క్షేత్ర‌స్థాయిలో ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి 2,36,726 పెన్షన్లలో 1,80,216 పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.

News May 31, 2024

శ్రీకాకుళంపై తూర్పుగోదావరి జట్టు విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ కాగా తదుపరి బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు 39.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది.

News May 31, 2024

ఉదయగిరి-కావలి హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతంలోని దాసరపల్లి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నేలటూరు గ్రామానికి చెందిన మేడేపల్లి రమణయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కొండాపురం వెళుతుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఘటనలో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

ప.గో.: ఉప్పుకు తగ్గిన డిమాండ్.. భారీగా ధర

image

తమిళనాడులో భారీవర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందటి వరకు 75 కేజీల బస్తా రూ.100- 150 పలకగా, ప్రస్తుతం రూ.200 దాటింది. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాల్లో ఉప్పు తయారీచేస్తున్నారు. గతంలో ఎకరాకు 800- 900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈ సారి 1,300 నుంచి 1,400 వరకు వస్తోంది. పెరగడంతో దాదాపు 7వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ది చేకూరుతుంది.

News May 31, 2024

105వ ర్యాంకు సాధించిన సింహాద్రిపురం పాలిటెక్నిక్ విద్యార్థి

image

సింహాద్రిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దావూద్ హుస్సేన్ ఏపీ ఈసెట్‌లో 105 ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దావూద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల బోధన, సహకారం వలన 105వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. హుస్సేన్‌ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.

News May 31, 2024

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ వెబ్‌ ఆప్షన్‌ నమోదు ఇలా..

image

శ్రీకాకుళం జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు బ్రాంచ్‌, కళాశాల ఎంపిక కోసం తమ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఈ నెల 31 నుంచి జూన్‌ 1 వరకు.. 1- 50,000 వరకు, జూన్‌ 2, 3 తేదీల్లో 50,001- 90,000 వరకు, 4, 5 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.

News May 31, 2024

విజయనగరం: మూడు రోజులు మద్యం షాపులు బంద్  

image

ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జూన్ 3, 4, 5 తేదీలలో మద్యం షాప్‌లు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. లెండి, జే‌ఎన్‌టీ‌యూ కళాశాలలో ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తామన్నారు.

News May 31, 2024

పిఠాపురం: వంగా గీత రూ.10 లక్షల లంచం తీసుకున్నారు: వర్మ

image

పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ EHS ఆసుపత్రిలో ఉద్యోగాలకు రూ.10 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని చెప్పారు.

News May 31, 2024

మచిలీపట్నం: కృష్ణా వర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కృష్ణా వర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 5,622మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 2,641మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అలాగే 7,354మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాయగా 46.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం ఇవ్వని విధంగా తాము రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు.