Andhra Pradesh

News May 31, 2024

ఏలూరు విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 1ST RANK

image

ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దేవరగోపవరానికి చెందిన కేశన మీనాక్షి డీసెట్ భౌతికశాస్త్ర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం పామర్రులో ప్రగతి మహిళా అకాడమీలో డిగ్రీ చదువుతుంది. తండ్రి సూర్యచంద్రరావు వ్యవసాయ కూలీ, తల్లి సునీత గృహిణి. శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జడ్పీ ఉన్నత పాఠశాల పెదనిండ్రకొలను హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.  – CONGRATS మీనాక్షి.

News May 31, 2024

కడప జిల్లా నుంచి వెళ్లిపోవాలని నోటీసులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్న సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు, అల్లర్లకు తావు లేని విధంగా ప్రశాంత కౌంటింగ్ కు పటిష్ఠ చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు తాజాగా జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను వారం రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అలాగే మరో 32 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.

News May 31, 2024

టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళం

image

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ రూ.1.5 కోట్లను స్వామివారికి చెందిన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు విరాళం ప్రకటించారు. తమ కంపెనీ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీశారు. తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కలిసి ఆయనకు సంబంధిత పత్రాలు అందజేశారు. దాతలను పలువురు అభినందించారు.

News May 31, 2024

జూపాడు బంగ్లా : విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి వ్యక్తి మృతి

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జూపాడు బంగ్లా మండల పరిధిలోని తంగడంచ గ్రామం సమీపంలో శుక్రవారం జరిగింది. పారుమంచాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జూపాడు బంగ్లాకు వెళ్లి పారుమంచాలకు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అతను మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 31, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు

image

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. తాడిపత్రిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జేసీపై కేసులు నమోదు చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించగా జేసీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలు చూపుతూ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

News May 31, 2024

ప్రకాశం: ఎన్నికల ఫలితాలకై ఉత్కంఠతో ఎదురుచూపులు

image

వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసేవి ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

News May 31, 2024

నెల్లూరు: జాగ్రత్తగా ఫోన్ వాడండి..!

image

నెల్లూరు జిల్లాలో దాదాపు 7.50 లక్షల మంది మొబైల్ వాడుతున్నారు. ఇందులో 4.50 లక్షల మంది 5G, 4G కనెక్షన్ తీసుకున్నారు. 1.50 లక్షల మంది 3G, మరో 1.50 లక్షల మంది 2G నెట్ వినియోగిస్తున్నారు. 5జీ రాకతో కంటెంట్ స్క్రీనింగ్, షేరింగ్ పెరుగుతోంది. ఈక్రమంలో ఫేక్, గొడవలకు కారణమయ్యే సమాచారం వ్యాపిస్తోంది. ఎన్నికల సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సమాచారం షేర్ చేస్తే చర్యలు తప్పవని SP ఆరిఫ్ హఫీజ్ హెచ్చరిస్తున్నారు.

News May 31, 2024

ఫలితాల కోసం వర్సిటీ విద్యార్థుల ఎదురుచూపు

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలో బీఎస్సీ, బీఏ తదితర డిగ్రీ కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. 2024 జనవరిలో ఆరో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు జరిగినట్లు విద్యార్థులు శుక్రవారం తెలిపారు. సుమారు 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల కాలేదని, పీజీలో చేరేందుకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

News May 31, 2024

యర్రగొండపాలెంలో జర్నలిస్టు మృతి

image

యర్రగొండపాలెంలో సీనియర్ జర్నలిస్టు షేక్ కలీం శుక్రవారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు వలి సాహెబ్, బాజీ, రసూల్ ఖాన్, నాగేష్, గణేశ్, కొండయ్య, అజహర్, తదితరులు పాల్గొన్నారు.

News May 31, 2024

రాయచోటి: 3 రోజులు మద్యం అమ్మకాలపై నిషేధం

image

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల లెక్కింపు సందర్భంగా జూన్ నెల 3, 4, 5వ తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.