Andhra Pradesh

News May 31, 2024

విజయనగరం ఆసుపత్రిలో చేరిన MLC 

image

జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఉన్నట్టుండి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూనే టీడీపీకి మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో మండలి ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు అనర్హత పిటిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. గ్లాండ్ బ్లేడర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరానంటూ రఘురాజు సంకేతాలు పంపారు.

News May 31, 2024

అనంత: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎన్ని రౌండ్లలో తెలుస్తాయంటే..!

image

అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోక్ సభ పరిధి, 8అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను వేరుగా లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాల కొస్తే ఒక్క తాడిపత్రి మాత్రమే 6 టేబుళ్లు, మిగతా స్థానాలకు 4 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్ 5 రౌండ్లు, రాప్తాడు 3, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గంలో 2 రౌండ్లు చొప్పున, తాడిపత్రి, రాయదుర్గం 1 రౌండ్లోనే లెక్కింపు పూర్తి కానుంది.

News May 31, 2024

కృష్ణా: ఒక పెళ్లి.. రెండు ట్విస్ట్‌లు

image

నూజివీడు మండలం గొల్లపల్లిలో జరగాల్సిన ఓ పెళ్లిలో ట్విస్ట్ నెలకొంది. తాళికట్టే వేళ వధువు కళ్లు తిరిగి పడిపోయింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, పెళ్లి పెద్దలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే.. పెళ్లి ఇష్టం లేక కావాలనే ఇలా చేసినట్లు వధువు చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. దీంతో 2 కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వధువు మైనర్‌. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 31, 2024

విశాఖ: బాధిత మహిళకు వైద్య పరీక్షలు

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధిత మహిళకు కేజీహెచ్ ప్రసూతి విభాగంలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక ఆరోపణలపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పరీక్షలు చేశారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

News May 31, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

చీమకుర్తిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఇసుక వాగుకు చెందిన గుంటూరు రమేశ్ (43) పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

నెల్లూరు: 43 బైకులు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వేదాయపాళెం, విడవలూరు, సీతారామపురం, కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

News May 31, 2024

కడప: అంధుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు చేరవచ్చని తెలిపారు. జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.

News May 31, 2024

ధర్మవరంలో సంపత్ కుమార్ హత్య..UPDATE

image

ధర్మవరంలో బుధవారం న్యాయవాది సంపత్ కుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే.. మృతుని స్నేహితునికి, మరో న్యాయవాది కృష్ణారెడ్డికి స్థల వివాదం ఉందని, స్నేహితుడికి మద్దతు తెలపడంతో హత్య చేశారని సంపత్ తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి హంతకులు సంపత్‌ను హిందూపురంలో కారులో ఎత్తుకెళ్లి మార్గమధ్యలో కొడవలిలో నరికి చంపి.. ధర్మవరం చెరువు కట్టలో పడేసినట్లు సమాచారం. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

News May 31, 2024

చిలకలూరిపేట వద్ద రెండు లారీలు ఢీ

image

చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భోగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

నెల్లూరు: ఆలస్యంగా వస్తోన్న కృష్ణా

image

ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గురువారం సుమారు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచింది. సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకోవాల్సిన రైలు రాత్రి 9 గంటల తర్వాత వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రైలు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.