Andhra Pradesh

News September 11, 2025

నెల్లూరు: ప్రైవేట్ కళాశాలలో జరగని ప్రాక్టికల్ తరగతులు!

image

నెల్లూరు జిల్లాలో 185 Jr.కళాశాలలు ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 100 రోజులు గడిచినా ల్యాబ్‌ల బూజు దులిపే పనిలేదు. రసాయనాలు లేక, సదుపాయాలు లేని పరిస్థితి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కేవలం థియరీపై దృష్టి పెడుతున్నారు. పరీక్షలకు ముందు ల్యాబ్‌లు తెరిచి పూర్తి మార్కులు వేసి దగాకు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News September 11, 2025

ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

image

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.

News September 11, 2025

వేగంగా దగదర్తి విమానాశ్రయం నిర్మాణ పనులు

image

దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రూ.916 కోట్లతో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూ సేకరణ, OLS సర్వే పూర్తి చేయడం జిల్లా యంత్రాంగంపై ఉంది. AAI అధికారులు కొండలు తొలగింపు, కాలువ మార్పు, చెరువు పూడ్చివేత వంటి మార్పులు సూచించారు. మొత్తం 1379 ఎకరాల్లో 669 ఎకరాలు సేకరించారు. దామవరం మేత పోరంబోకు భూములు, కౌరు గుంట రైతులకు పరిహారం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి.

News September 11, 2025

పలమనేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పలమనేరు నుంచి చిత్తూరు వెళ్లే ఘాట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ (ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి) అక్కడికక్కడే మృతి చెందారు. వృత్తి నిమిత్తం బైక్ పై ప్రయాణిస్తుండగా, మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పవన్ మరణంతో అతడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 11, 2025

విజయ డైరీ పాల సేకరణ ధరలు పెంపు

image

విజయ డైరీ పాల సేకరణ ధరలు పెంచనున్నట్లు పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కేజీ వెన్నకు రూ.775 లెక్కన లీటర్ పాలకు రూ. 77.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి కేజీ వెన్నకు రూ.785 లెక్కన లీటర్ పాలకు రూ. 78.50, సొసైటీ నిర్వహణకు రూ.1.50 కలుపుకొని రూ.80 ఇవ్వనున్నట్లు తెలిపారు.

News September 11, 2025

వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి మొదటి దర్శనం

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి కుమ్మరివారి ఇంటి నుంచి అమ్మవారి ప్రతిమను మెట్టినిల్లు అయిన చాకలివారి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దిష్టి చుక్క, కళ్లు పెట్టారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆపై ఊరేగింపుగా పోలేరమ్మ ప్రధాన గుడి వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టించారు. నయన మనోహరంగా ఉన్న పోలేరమ్మను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.

News September 11, 2025

నెల్లూరు నగరానికి 18వ ర్యాంకు

image

కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌లో నెల్లూరు నగరానికి 18వ ర్యాంకు వచ్చింది. 3 నుంచి 10 లక్షల విభాగంలో నగరానికి ఈ అవార్డు వరించింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షన్‌లో18వ ర్యాంకు రావడానికి కృషిచేసిన అధికారులు, మున్సిపల్ కార్మికులకు కలెక్టర్, నెల్లూరు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.

News September 11, 2025

చల్లపల్లి: పాఠశాల అన్నంలో పురుగులు

image

చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.

News September 11, 2025

తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం

image

కలవాయి మండల పరిధిలోని తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం రేపింది. తోపుగుంట – కొండాపురం మధ్య ప్రాంతంలో పర్ల కొండ గ్రామానికి చెందిన పూలే పెంచలయ్య అనే వ్యక్తి కలువాయిలోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తుంటారు. విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా తోపుగుంట వద్ద ఉన్న సోమశిల – పొదలకూరు రోడ్డును చిరుత పులి రోడ్డు దాటుతుండగా గమనించి స్థానికులను ఆయన అప్రమత్తం చేశారు. పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

News September 11, 2025

అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

image

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.